బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

బీజేపీ శనివారం తలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. షరతులతో కూడిన ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. నేషనల్ జాతీయ నాయకులూ, మంత్రులు ఎవరు వస్తున్నారో ఈ రోజు రాత్రి 9 గంటల లోపు పోలీసులకు చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.  500 మందితో ధర్నా చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవ్వరైనా ఆలా ప్రవర్తిస్తే పోలీసులు చర్యలు తోసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరసనలు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలు సైతం నిరసనలు తెలిపే హక్కు ఉంటుందన న్యాయస్థానం తెలిపింది.

సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలియజేస్తారని, ఒకవేళ ఒకవేళ ధర్నాచౌక్ వద్ద అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ చేసుకుంటారని ప్రశ్నించింది. ఆర్టికల్ 19 ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని తెలిపింది.   సాయంత్రం 4 గంటల లోపు పోలీసులు ధర్నాకు అనుమతి ఇస్తారా..? లేదా అనే విషయం తమకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేస్తే సహకరించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన మహాధర్నాకు  పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతి ఇచ్చేలా పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొంది బీజేపీ. 

మరోవైపు ఎన్నికల నామ సంవత్సరం కాబట్టే కేసీఆర్ రైతన్నలపై ప్రేమ చూపిస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీజేజీపై కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. నీతి వాఖ్యలు చెప్పే కేటీఆర్ లాల్ బహదూర్ శాస్త్రిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏ కంప్యూటర్ లీకైనా కేటీఆర్ దే నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. తండ్రి మాదిరి కొడుకుకు కూడా జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు.