‘సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్, 2022’ పోర్టల్ ప్రారంభం

‘సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2022’ పోర్టల్ www.cityfinance.in/rankings ని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  సోమవారం ప్రారంభించింది. డిజిటల్ విధానంలో, కాగితాలతో సంబంధం లేకుండా జరిగే ర్యాంకింగ్ ప్రక్రియలో   దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)  పాల్గొనవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ సంస్థల  ప్రస్తుత ఆర్థిక పరిస్థితి,  కాలక్రమేణా ఆర్థిక పనితీరు మెరుగు పరచడానికి చర్యలు అమలు చేస్తున్న స్థానిక సంస్థలను గుర్తించి, అవార్డులు అందించడానికి ‘సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2022’ ని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మెరుగుదల నాణ్యత ఆధారంగా మూల్యాంకనం చేయడం, గుర్తించడం, రివార్డ్ చేయడం వంటి లక్ష్యంతో ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  మంత్రి హర్దీప్ సింగ్ పూరి  డిసెంబర్ 28, 2022న  ‘సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2022’ మార్గదర్శకాలు విడుదల చేశారు.

దీనిలో  పాల్గొనే  పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితి  15 సూచికల ఆధారంగా  మూల్యాంకనం చేస్తారు.  (i) వనరుల సమీకరణ, (ii) వ్యయ పనితీరు మరియు (iii) ఆర్థిక పాలన కింద ప్రమాణాల ఆధారంగా మూల్యాంకన జరుగుతుంది.

 (i) 40 లక్షల  కంటే ఎక్కువ (ii) 10-40 లక్షల  మధ్య (iii) లక్ష  నుంచి10 లక్షలు  (iv) 100,000 కంటే  కంటే తక్కువ జనాభా కలిగిన నగరాలుగా నగరాలను విభజించి వాటి స్కోర్‌ల ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. ప్రతి జనాభా విభాగంలో మొదటి 3 నగరాలను జాతీయ స్థాయిలో అలాగే ప్రతి రాష్ట్రం/రాష్ట్ర క్లస్టర్‌లో గుర్తించి అవార్డులు అందిస్తారు.  

‘సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ 2022’లో పాల్గొనడానికి చివరి తేదీగా 2023  మే 31ను నిర్ణయించారు. పోటీలో  పాల్గొనే పట్టణ స్థానిక సంస్థలు  ఆన్‌లైన్  ద్వారా అవసరమైన సమాచారం /పత్రాలు  (ఆడిట్ చేయబడిన ఖాతాలు, వార్షిక బడ్జెట్‌లు, స్వీయ-నివేదిత పనితీరు కొలమానాలతో సహా) www.cityfinance.in.లో సమర్పించవచ్చు.

సమాచార సేకరణ ప్రక్రియలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌గా వ్యవహరించే క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా స్థానిక పట్టణ సంస్థలు  / రాష్ట్రాలకు సహకారం   అందిస్తుంది. సమాచారం  ధృవీకరణ తర్వాత 2023 జూలై నెలలో తుది ర్యాంకింగ్‌లు ప్రకటిస్తారు. 

పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితిపై సిటీ ఫైనాన్స్ ర్యాంకింగ్స్ విధాన రూపకర్తలకు అవగాహన కలిగిస్తాయి.  ఆర్థిక ర్యాంకింగ్స్‌లో పాల్గొనడం ద్వారా స్థానిక పట్టణ సంస్థలు తమ ఆర్థిక పనితీరుతో పాటు  ఇతర నగరాల పనితీరును అంచనా వేయగలుగుతాయి. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్థానిక సంస్థలు అవకాశం కలుగుతుంది.