బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు చెందిన ఢిల్లీ నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో ఆ తనిఖీలు జరిగాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కేసుతో లింకు ఉన్న బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంభం మనీల్యాండరింగ్‌కు పాల్పడిందని, ఈ కేసుతో లింకున్న 15 ప్రదేశాల్లో నేడు ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. కాగా, మార్చి ఏడో తేదీన మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కుమార్తె మీసా భారతి ఇంట్లో ఉంటున్న లాలూను సుమారు అయిదు గంటల పాటు ప్రశ్నించారు.
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న లాలూ ప్రస్తుతం తన కూతురు ఇంట్లో ఉంటున్నారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించి అతి తక్కువ ధరకే భూముల్ని కొనుగోలు చేసినట్లు లాలూపై ఆరోపణలు ఉన్నాయి.

More Stories
ఇండిగో సంక్షోభంపై అత్యున్నత విచారణ .. వేయి విమానాలు రద్దు
మస్క్ సోషల్ మీడియా ‘ఎక్స్’పై ఈయూ భారీ జరిమానా
మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ