రెండేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా ఉత్తర ప్రదేశ్ లోనూ వేలాది మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా ప్రభావంతో తల్లితండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారు, ఇద్దరినీ కోల్పోయి పూర్తి అనాథలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వాలు మానవతాదృక్ఫథంతో సాయం అందించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది.
పలు ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా యూపీలో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి తల్లితండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరు చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు చాలా ప్రభుత్వాలు ఏకమొత్తంగా పరిహారం అందించాయి.
మరికొన్ని ప్రభుత్వాలు నిధులు లేవనే సాకుతో ఇప్పటికీ తప్పించుకుంటున్నాయి. కానీ యూపీలో యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మాత్రం కరోనాతో అనాథలుగా మారిన వారి కోసం ఏకంగా ఓ రెగ్యులర్ సంక్షేమ పథకాన్నే అందుబాటులోకి తెచ్చింది. యూపీలో తమ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ పథకం అమలు చేసి తీరుతామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ప్రకటించారు.
More Stories
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
అన్ని మెగాసిటీల్లో కెల్లా ముంబయి సురక్షితమైనది
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం