ఔషధ నియంత్రణ యంత్రాంగాలు ప్రమాణాలు పాటించాలి

ఔషధ నియంత్రణ యంత్రాంగాలు ప్రమాణాలు పాటించాలి

దేశంలోని ఔషధ నియంత్రణ యంత్రాంగాలు కాలానుగుణంగా, అదే సమయంలో స్థిరంగా ఉండే నిష్కళంకమైన ప్రమాణాలను కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా  చెప్పారు.

 “ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు”పై రెండు రోజుల చింతన్ శివిర్‌ను హైదరాబాద్ లో ప్రారంభిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర సంస్థలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేయడం, ఒకదానికొకటి బలాన్ని పెంచుకోవడం, నియంత్రణ వ్యవస్థల్లోని లోపాలను తొలగించడానికి సంయుక్తంగా పని చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలిపారు.

చింతన్ శివిర్ ఫార్మా, ఆరోగ్య రంగాలలోని వాటా, లబ్దిదారులందరికీ దృఢమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి సమగ్ర, సమన్వయ విధానాల కోసం మార్గాలను  చర్చించడానికి ఒక వేదిక అని కేంద్ర మంత్రి చెప్పారు.

కేంద్రం, రాష్ట్రాల్లోని వివిధ ఏజెన్సీలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం దేశంలో తయారు చేసిన, దేశీయ – అంతర్జాతీయ వినియోగదారులు వినియోగించే  ఔషధాలు అత్యధిక నాణ్యతతో, ప్రపంచ ప్రామాణిక ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలకులకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో ముఖ్యమైన విధానాలను ఏర్పరుస్తాయని భరోసా వ్యక్తం చేశారు.

దీని వల్లన వినియోగదారులకు అత్యధిక నాణ్యతతో కూడిన ఫార్మా ఉత్పత్తులను అందిస్తాము అనే భరోసా ఇచ్చి “ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్”గా పిలుబడుతున్న భారత్ కీర్తిని నిలబెట్టేలా చేస్తుందని తెలిపారు.  సహకార మేధోమథనపు రెండు రోజులలో చర్చలను సుసంపన్నం చేయడానికి వారి క్షేత్ర స్థాయి అనుభవం నుండి వారి జ్ఞానం, అంతర్దృష్టులను పంచుకోవాలని ఆయన సూచించారు.

“మన సామూహిక అనుభవాన్ని సమష్టి చేయడం ద్వారా మనం ఎదుర్కొనే సవాళ్లను సహకారంతో పరిష్కరించుకోవచ్చు. ఈ రెండు రోజుల మంథన్ లో బలమైన, దృఢమైన, ప్రజలకు అనుకూలమైన యంత్రాంగాలను నిర్మించడానికి గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

“భారత్‌లో తయారయ్యే ఔషధాలుపై వినియోగదారుల విశ్వాసాన్ని మనం ఎలా నిలబెట్టగలం? ఇతర దేశాలు అనుకరించే విధంగా భారతీయ ఔషధ నియంత్రణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మార్చేందుకు సుస్థిరంగా కృషి చేయాలని వాటాదారులందరినీ నేను కోరుతున్నాను” అని ఆయన ఉద్బోధించారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖూబా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ కూడా పాల్గొన్నారు.