గర్భనిరోధక మాత్రల అమ్మకంపై తాలిబన్ల నిషేధం

అఫ్గానిస్థాన్‍లో తాలిబన్ పాలనలో మహిళలు, బాలికలను కించపరిచే విధంగా,వారి హక్కులు, స్వాతంత్ర్యాలను హరించే విధంగా నిరంకుశ నిర్ణయాలకు అంతులేకుండా పోతున్నది. ఇప్పటి వరకు వారికి చదువుకొనే అవకాశం లేకుండా, ఉద్యోగం చేసే వీలు లేకుండా కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు తాజాగా గర్భనిరోధక మాత్రల అమ్మకంపై నిషేధం విధించడం ద్వారా వారిని మరింతగా అణచే ప్రయత్నం చేస్తున్నారు.
 
అఫ్గానిస్థాన్‍లోని రెండు ప్రధాన నగరాల్లో గర్భనిరోధక మాత్రలు, మెడిసిన్ వాడడం, అమ్మడంపై నిషేధం విధించారని గార్డియన్ కథనం వెల్లడించింది.
మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భ నిరోధక మాత్రలు, కొన్ని రకాల ఇంజెక్షన్లు వినియోగిస్తారు. వీటి అమ్మకాలపై తాలిబన్లు నిషేధం విధిస్తున్నారు.
 
 ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని మెడికల్‌ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నది. ఏ మందుల దుకాణంలోనూ గర్భనిరోధక వస్తువులుగానీ, మందులు గానీ అమ్మకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది.  ముస్లిం జనాభా పెరగకుండా ఉండేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, దీనిలో భాగంగానే కాంట్రాసెప్టివ్‌లను విరివిగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వం భావిస్తున్నది.
 
దీనిని నివారిందుకుగాను దేశంలో గర్భనిరోధకాల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. పాశ్చాత్య దేశాలకు ముస్లిం జనాభా పెరగడం ఇష్టం లేనందునే గర్భనిరోధకాలను మనపై బలవంతంగా రుద్దుతున్నాయని, అందువల్ల వాటిపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబాన్‌ సర్కార్‌ చెప్తున్నది.
 
“వాళ్లు నా దుకాణానికి తుపాకులతో రెండుసార్లు వచ్చి, గర్భ నిరోధక మాత్రలు దుకాణంలో అమ్మకానికి ఉంచవద్దని బెదిరించారు. వాళ్లు కాబూల్‌లోని ప్రతి మందుల షాపును రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారు. దీంతో మేము వాటిని అమ్మడం ఆపేశాం” అని కాబుల్‍లోని ఓ మెడికల్ షాపు యజమాని చెప్పినట్టు గార్డియన్ రిపోర్ట్ వెల్లడించింది.
 
“గర్భనిరోధక మాత్రలు, డెపో ప్రెవెరో ఇంజెక్షన్లును ఫార్మసీలో ఉంచుకునేందుకు తాలిబన్లు అనుమతించడం లేదు. ఈ నెల ప్రారంభంలో ఇది మొదలైంది. ఇప్పటికే ఉన్న స్టాక్‍ను అమ్మేందుకు కూడా భయపడుతున్నాం” అని కాబుల్‍లోని మరో షాప్ యజమాని గార్డియన్‍తో చెప్పారు.

ముస్లిం జనాభాను తగ్గించే కుట్రతో గర్భ నిరోధక మాత్రలను పాశ్చాత్య దేశాలు తీసుకొచ్చాయని తాలిబన్లు భావిస్తున్నారని గార్డియన్ కథనం పేర్కొంది. ముస్లిం మహిళలు ఇవి తీసుకుంటే ముస్లిం జనాభాను తగ్గించవచ్చని ఆ దేశాలు వీటిని తయారు చేస్తున్నాయని చెబుతున్నారట. ఈ కారణంగానే నిషేధం విధిస్తున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు.

 “జనాభాను నియంత్రించాలనే పాశ్చాత్య విధానాన్ని ఇక్కడ మీరు ప్రచారం చేసేందుకు మీకు అనుమతి లేదు. ఇదో అవసరపు పని” అని ఓ షాప్ యజమానితో తాలిబన్లు చెప్పారట. 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కిన తాలిబన్లు మహిళలు, బాలికలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. గర్భం నిరోధించుకోవడానికి ఎలాంటి గర్భనిరోధకాలను ఉపయోగించవద్దని తాలిబాన్ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి మరీ మహిళలను బెదిరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కాబూల్‌లోని అన్ని మెడికల్‌ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టారు.

పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన నోటీసులు అతికించారు. ఎవరైనా గర్భనిరోధకాలు అమ్ముతున్నట్లు తెలిసినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారని ఓ దుకాణం యజమాని చెప్పారు. మీరు బయటికి వెళ్లి పాశ్యాత్య పద్ధతి అయిన జనాభా నియంత్రణ గురించి ప్రచారం చేయవద్దని, ఇది అనవసరమైన పనని తాలిబన్లు తనను హెచ్చరించినట్లు ఓ మిడ్‌వైఫ్ పత్రికతో చెప్పింది.

యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని నిషేధించారు. వారి ఉన్నత విద్య కలలను చెరిపివేస్తున్నారు. ఉద్యోగాలు చేయకుండా ఆపేస్తున్నారు. తాజాగా గర్భ నిరోధక మాత్రం విషయంలోనూ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై మహిళా హక్కుల ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“మహిళల చదువు, ఉద్యోగాలపైనే కాకుండా శరీరాలపై కూడా ఆంక్షలు విధిస్తూ మహిళల మానహ హక్కులను తాలిబన్లు నియంత్రిస్తున్నారు. ఇది దారుణం” అని యూకేలో యాక్టివిస్ట్‌గా ఉన్న అఫ్గాన్ సంతతికి చెందిన షబ్నమ్ నసిమి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంభం నియంత్రణ అనేది ప్రతీ ఒక్కరి హక్కు అని ఆమె స్పష్టం చేశారు.