
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
పెట్టుబడిదారుల భద్రతను నిర్ధారించేందుకు కమిటీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, ఆ కంపెనీ విధివిధానాలు నిర్దిష్టంగా ఉండాలని, తద్వారా ఇది నగదు, పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రభావితం చేయరాదని స్పష్టం చేశారు. దానితో ప్రతిపాదిత విధివిధానాలపై బుధవారంలోగా నోట్ సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారం జరగనుంది.
ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి చెప్పారు. కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా కమిటీ సబ్యుల పేర్లను సుప్రీంకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇంతకు ముందు సుప్రీంకోర్టు విచారణ జరిపి, కమిటీ ఏర్పాటుపై కేంద్రం స్పందన కోరింది. ఈ క్రమంలో సోమవారం విచారణ జరగ్గా కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.
మదుపుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కమిటీ వేసేందుకు సిద్ధమన్న కేంద్రం.. అదానీ, హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని సెబీ చూస్తోందని కేంద్రం తరఫున ఎస్‌జీ తుషార్ మెహత కోర్టుకు తెలిపారు. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ సంస్థల షేర్లు కొన్ని రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో $120 బిలియన్లను (విలువలో 50 శాతానికి దగ్గరగా) ఎలా కోల్పోయాయి? పెట్టుబడిదారులకు భారీ నష్టాలకు దారితీసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఈ విచారణ జరిగింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు