
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని బీజేపీ రాష్ట్ర నాయకులు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం సూరిపల్లి, నాగారం గ్రామాలలో ప్రజా గోస.. బిజెపి భరోసా శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరిగాయి.
ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నెరవేర్చలేని హామీలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బిజెపి నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నాడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో లక్షల కోట్ల అప్పులమయంగా మారిందని పేర్కొన్నారు.
కుటుంబ పాలనతో నియంత పోకడలతో తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ధ్వజమెత్తారు. సొంత రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు ఆపలేని కేసీఆర్ ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ ఎలా సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి