
తీరం కోతకు గురవడానికి తలెత్తుతున్న పరిస్థితులు, కారణాల గురించి వివరిస్తూ.. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాల కారణంగా తలెత్తే వరదలు, సముద్ర మట్టం పెరుగుదల తదితర ప్రకృతి సహజ వైపరీత్యాలకు తోడు ఓడరేవులు, నౌకాశ్రయాల నిర్మాణాలు, నదులు దెబ్బతినడం వంటివి కూడా కోతకు కారణమవుతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.
కోత కారణంగా భూమి, ఆవాసాలు, మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతినడంతో పాటు ఫిషింగ్ కార్యకలాపాలకు అవసరమైన స్థలం తగ్గిపోతుందని చెప్పారు. విశాఖ నగరంలో మూడు దశాబ్దాలుగా కోతను ఎదుర్కొంటోందని, ప్రతికూల పరిస్థితుల్లో సుమారు 3.5 కిలోమీటర్ల పర్యాటక బీచ్, తీరప్రాంత రహదారులు కోతకు గురై క్షీణించాయని వివరించారు.
తీరం కోతను నివారించేందుకు పటిష్టమైన కార్యాచరణను రూపొందించి, విశాఖ నుంచే దాన్ని అమలు చేయడం మొదలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని అనంతరం జివిఎల్ మీడియాకు తెలిపారు. విశాఖ వంటి సుందర పర్యాటక నగరంలో తీర ప్రాంతం కోతకు గురవడం సామాన్య విషయం కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరవాసుల్లో కూడా ఈ విషయంపై పూర్తి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలో విశాఖలో ఈ విషయంపై వివిధ వర్గాల ప్రముఖులతో ఒక అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా