ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతంగా హత్య చేశారు. కుటుంబం కండ్ల ఎదుటే గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
నక్సలైట్ల స్మాల్ యాక్షన్ గ్రూప్ ఈ ఘటనకు పాల్పడింది. నీలకంఠ కక్కెం తన స్వగ్రామమైన ఆవపల్లిలో కుటుంబ సమేతంగా బంధువుల వివాహ వేడుకలను వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లినట్లుగా సమాచారం. తిరిగి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి అవపల్లికి వస్తున్న సమయంలో నక్సలైట్లు అటకాయించారు.
నీలకంఠను కారు నుంచి బయటకు తీసుకువచ్చి.. గొడ్డలి, కత్తితో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. నీలకంఠ కక్కెం దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. జనపద్ మాజీ పంచాయతీ సభ్యుడు కూడా ఉన్నారు.
ఈ ఘటన అవపల్లి పోలీస్ స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని పేకారంలో చోటుచేసుకుంది. దీంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ ధ్రువీకరించారు. అయితే, నీలకంఠ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
నర్మదా తీరంలో ‘జాతీయ చలనచిత్ర అవార్డుల’ వేడుక
ఛత్తీస్‌గఢ్‌లో 14 మావోయిస్టుల డంప్‌లు గుర్తింపు