
ప్రముఖ వెబ్‌సైట్ వికీపీడియాను తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించనుందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. వికీపీడియాలో ఇస్లాం మతాన్ని అగౌరవపరిచేలా ఉన్న కంటెట్‌ను తొలగించమని 48 గంటలపాటు గడువు ఇచ్చినా, వికీపీడియా సంస్థ స్పందించకపోవడంతో పాక్ టెలికాం శాఖ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు మీడియా వర్గాలు శనివారం తెలిపాయి.
ఇక విషయంపై టెలికాం అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘వికీపీడియా కంటెంట్ తొలగించకపోవడంతో శుక్రవారం అర్థరాత్రి నుంచే దాన్ని నిషేధించడం జరిగింది’ అని పేర్కొన్నారు. కాగా, పాక్ ప్రభత్వ నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వికీపీడియాను నిషేధించడం వల్ల. విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలోని వర్గాలపై ప్రభావం పడుతుందని డిజిటల్ హక్కుల కార్యాక్త ఉసామాఖిల్జి అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు వికీపీడియా సంస్థ కూడా దీనిపై స్పందించింది. తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. వికీపీడియాను నిషేధిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞానసంపదను పాక్ ప్రజలు కోల్పోతారని, దేశ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండదని పేర్కొంది.
మతానికి సంబంధించిన కంటెంట్‌ను తొలగిస్తే వికీపీడియా సేవలు పునరుద్ధరించబడతాయని పాక్ ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడే కాదు.. గతంలోనూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లను పాక్ ప్రభుత్వం నిషేధించింది.
More Stories
పాక్ ను మట్టికరిపించిన భారత మహిళల జట్టు
భారీ వర్షాలకు నేపాల్ లో 51 మంది, డార్జిలింగ్ లో 23 మంది మృతి
ఖలిస్థాన్ ఉగ్రవాదులకు నిధులపై కెనడా నిఘా