ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కుత్రిమ మేధస్సు) .ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక, రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించబోతోందని భావిస్తున్నారు. డ్రైవర్ లేకుండానే కారు వెళ్లడం, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో కోడిగుడ్లు ఉన్నాయా, లేదా చెప్పడం లాంటివెన్నో దీని కిందకు వస్తాయి.
ఇప్పటి వరకు మన జీవితాల్లోకి ప్రవేశించిన టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఏఐ రూపంలో మన ఇంట్లోకి కూడా ప్రవేశించబోతోంది. ఏఐ అనేది మన జీవితాలకు చాలా ప్రమాదకరం అని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అది మన జీవితాల్లోకి చాలా వేగంగా విస్తరిస్తోంది.
ఈ క్రమంలో, వచ్చే నెలలో ఒక రోబో లాయర్ ప్రపంచంలోనే తొలిసారి కోర్టులో కేసును వాదించబోతోంది. అమెరికాలోని కోర్టులో వాదనలను వినిపించబోతోంది. డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది.
అయితే ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ వెల్లడించలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుందట ఈ రోబో లాయర్.

More Stories
క్యాన్సర్ నిరోధఖాలున్న 148 లైకెన్ల గుర్తింపు
ఢిల్లీలో సినిమా ప్రచారం కోసం `తప్పిపోతున్న అమ్మాయిలు’ ప్రకటనలు
గడ్చిరోలి జిల్లాలో ముగ్గురు నక్సలైట్లు హతం