
కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి.), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సహకారం కోసం ఒక ప్రణాళికను రూపొందించడానికి ఆరుగురు సభ్యుల డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం కార్యదర్శి వి శ్రీనివాస్ నేతృత్వంలో విజయవాడ సందర్శించింది. ఈ సందర్భంగా ఎ.పి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో, ఎ.పి. సాధారణ పరిపాలనా శాఖ (జి.ఎ.డి.) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితర సీనియర్ అధికారులతో ప్రతినిధి బృందం అధికారిక సమావేశాలు జరిపింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం లక్ష్యంగా స్పందన పేరిట సమగ్రమైన ప్రత్యేక వ్యవస్థను ఎ.పి.లో అమలు చేస్తున్నారని శ్రీనివాస్ అభినందించారు. ఇ-ఆఫీస్ పద్ధతులను విస్తృత స్థాయిలో చేపట్టి, నేషనల్ ఇ-సర్వీసెస్ బట్వాడా మధింపు ప్రక్రియ-2021 కార్యక్రమం కింద పటిష్టమైన పనితీరు కోసం ఈ వ్యవస్థను అమలు చేశారని ఆయన పేర్కొన్నారు.
అనంతరం నంబూరులోని గ్రామ సచివాలయాన్ని కూడా డి.ఎ.ఆర్.పి.జి. ప్రతినిధి బృందం సందర్శించింది. పౌర ప్రయోజనాలే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పరిపాలనా నమూనాలలోని ఉత్తమ పద్ధతుల గురించి ఈ బృందం అడిగి తెలుసుకుంది.
సహకార ప్రణాళిక అంశాలు
1. ఎ.పి.హెచ్.ఆర్.డి.ఐ. సహకారంతో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మెరుగుపరచడానికి సేవోత్తం పథకం కింద ఫిర్యాదుల పరిష్కార విభాగానికి చెందిన 5,000మంది అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం.
2. ఉభయపక్షాలకు అంగీకార యోగ్యమైన తేదీల్లో తిరుపతిలో ఇ-గవర్నెన్స్, సేవల బట్వాడా వ్యవస్థను మెరుగుపరచడం, ఫిర్యాదుల పరిష్కారంపై ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేయడం.
3. సుపరిపాలనా సూచిక, నేషనల్ ఇ-సర్వీసెస్ బట్వాడా మధింపు సూత్రీకరణలో ఏపీ ప్రభుత్వంతో డి.ఎ.ఆర్.పి.జి. మధ్య మెరుగైన సమన్వయం కల్పించడం.
4. ఆంధ్రప్రదేశ్ కోసం జిల్లా స్థాయిలో సుపరిపాలన సూచిక రూపకల్పన.
5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ సాధనగా స్పందన కార్యక్రమానికి డాక్యుమెంటేషన్/ప్రచారం.
అనంతరం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఈ ప్రతినిధి బృందం కలుసుకుంది. పరస్పర సహకారం కోసం ప్రతిపాదిత ప్రణాళికను గురించి ఆయనకు వివరించింది. ప్రతినిధి వర్గం చూపిన చొరవను ముఖ్యమంత్రి కూడా ప్రశంసించారు. పౌర ప్రయోజనాలకోసం ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న పరిపాలనా నమూనాలపై ముఖ్యమంత్రి తన ఆలోచనలను తెలియజేశారు.
డేటా అనలిటిక్స్‌తో పాటు ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై దృష్టి సారించడంతో స్పందన పోర్టల్ మరింత బలోపేతం కాగలదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంకా గ్రామ స్థాయిలో ఇ-సేవలు, ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి.) సేవల సమగ్ర శ్రేణిని అందించడానికి, గ్రామ స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్.డి.జి.ల) పురోగతిని పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయాలను అభివృద్ధి చేసినట్టు ఆయన చెప్పారు.
ఇంటర్నెట్ అనుసంధానం అనేది సవాలుగా మిగిలిపోయిందని, భారత్ నెట్ కవరేజీని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డిజిటల్ పరిజ్ఞాన సాధికారత ద్వారా పౌరులను ప్రభుత్వానికి చేరువ చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిని సారించిందని పేర్కొన్నారు. సంస్థల డిజిటల్ పరివర్తన గ్రామ స్థాయి కార్యక్రమాల సామాజిక తనిఖీ ద్వారా జవాబ్దారీతనం, పారదర్శకత మెరుగుపడిందని ఆయన చెప్పారు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ