సికింద్రాబాద్ -విజయవాడ మధ్య ఆర్‌ఆర్‌టీఎస్ రైలు!

అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకొంటూ, అత్యంత వేగంగా నడిచే రైళ్లను విమానాలతో పోటీగా ప్రయాణికులకు వసతులు కల్పిస్తూ వరుసగా ప్రవేశపెడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా మరోకొత్త త్వరగా రైళ్లను అందుబాటులోకి తేనున్నది. మెట్రో రైలు మాదిరిగా రెండు పట్టణాలను అనుసంధానం చేసే ఆర్‌ఆర్‌టీఎస్ రైళ్లను తీసుకొస్తున్నది.
ఇప్పటికే వందే భారత్ రైళ్లను వరుసగా ప్రవేశ పడుతున్నది. వీటికన్నా వేగంగా నడిచే ఆర్‌ఆర్‌టీఎస్ రైలు వ్యవస్థను ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. 2024 నాటికి ఈ రైలు అందుబాటులోకి రానున్నది. 
 
మరో ఏడు నగరాలకు సహితం ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఆలోచనతో,  సిక్రిందాబాద్-విజయవాడ మధ్య కూడా ఆర్‌ఆర్‌టీఎస్ లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వీటి నిర్మాణానికి కిమీ రూ 340 కోట్ల మేరకు ఖర్చు అవుతుంది. 
 
2024 నాటికి డిపిఆర్ ను  అందుబాటులోకి తెచ్చే విధంగా  తయారు చేస్తున్నారు.  ఈ ఆర్‌ఆర్‌టీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.  ఆర్ఆర్‌టీఎస్ అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం. ఇప్పటికే అనేక దేశాలలో ఇటువంటి వ్యవస్థ అందుబాటులో ఉంది.
రైల్వేశాఖతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆర్‌ఆర్‌టీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. మొదటగా 1998-99లో ఈ రైలుమార్గం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకు రాగా, ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నది.
ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు.