
అలాగే చంద్రుడిపైకి ల్యాండ్రోవర్ను పంపడంతో పాటు ఈ ఏడాది మార్స్, వీనస్‌లను సైంటిఫిక్ మిషన్లను పంపాలని యోచిస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లతో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక దాదాపు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. జూన్‌లో మిషన్‌ను ప్రారంభించేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.ఈ సారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని తెలిపారు. వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్వీ ఉపగ్రహ ఆధారిత ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వైలెన్స్-బ్రాడ్కాస్ట్ (ఎడిఎస్-బి ) రిసీవర్ సిస్టమ్‌ను సైతం పరీక్షించనున్నట్లు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఎస్ఎస్ఎల్వీ టెస్ట్ ఫ్లైట్‌లోనే ఏడీఎస్-బీ వ్యవస్థను పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
More Stories
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ తిరుపతి
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి