
సికింద్రాబాద్ నుంచి సంక్రాంతి పండగకి అదనంగా 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ ల నుంచి రాత్రిపూట బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రాకేశ్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్, రిజర్వ్ డ్ బోగీలు ఉంటాయని వివరించారు.
కాగా, సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన వాటితో కలిపి సంక్రాంతికి మొత్తం 124 ప్రత్యేక రైళ్లు జనవరి 1 నుంచి 20 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు ఈ నెల 31 నుంచి రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ తో సహా నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు వీటిని నడపనున్నట్లు పేర్కొంది. పండగ రద్దీ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు ఇవి అదనమని వివరించింది. ఈ రైళ్లు జనవరి 1 నుంచి జనవరి 20 వరకు ఆయా నగరాల మధ్య పరుగులు పెడతాయని తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి