రూ. 300 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాకిస్థాన్ బోటు

భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ బోటును భారత తీర రక్షక దళం పట్టుకుంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు రూ.300 కోట్ల విలువ చేసే 40 కేజీల డ్రగ్స్ కూడా బోటులో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులోని పది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
 
ఉగ్రవాద వ్యతిరేక బృందం ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ డిసెంబర్ 25-26 రాత్రి నోషనల్ అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్ వద్ద ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్ ఐసీజీఎస్  అరింజయ్‌తో గస్తీ కాసింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఫిషింగ్ బోటు ‘ఏఐ సోహెలి’ అనుమానాస్పదంగా భారత జలాల వద్ద తచ్చాడుతుండడాన్ని గమనించింది.
 
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ బోటును భారత తీర రక్షక దళం పట్టుకుంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు రూ.300 కోట్ల విలువ చేసే 40 కేజీల డ్రగ్స్ కూడా బోటులో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులోని పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.