
వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను సోమవారం సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్‌లను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వీడియోకాన్ లోన్ ఫ్రాడ్ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను సీబీఐ అధికారులు ఇవాళ మధ్యాహ్నం ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ నిందితులుగా ఉన్నారు.
వేణుగోపాల్ ధూత్‌ను కూడా మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని, ముగ్గురిని కలిపి ఓకేసారి విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ అధికారులు విన్నవించారు. కాగా, సీబీఐ వినతిపై స్పెషల్ కోర్టు నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడు రోజుల సీబీఐ కస్టడీ విధించింది.
చందాకొచ్చర్ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్ కంపెనీ రూ.3200 కోట్లకుపైగా లోన్ తీసుకున్నది.ఈ లోన్ మంజూరు సమయంలో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఐసీఐసీఐ సీఈవోగా ఉన్న చందా కొచ్చార్ 2018లో ఆ పదవికి రాజీనామా చేశారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు