
ఆంధ్ర ప్రదేశ్ లో మత మార్పిడి విపరీతంగా పెరిగిందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపిచ్చారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్లు యథేచ్ఛగా ప్రయత్నాలు సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి దుర్మార్గమైన మతం..అంటూ ఆయన మండిపడ్డారు.
ఎవరూ కూడా మతం మారకూడదని, మన మతంలో మనం ఉండాల్సిన అవసరం ఉందని స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. మన మతంలో మనం ఉండాలనే పిలుపును ఇవ్వడానికి డిసెంబర్ 25వ తేదీ నాడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నామని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాలను అన్యమతాలు ఈ విషయంలో లక్ష్యంగా చేసుకున్నాయని స్వామిజి ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో మతమార్పిళ్లను అడ్డుకోవడానికి ఆదివారం గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భగవద్గీతను పంపిణీ చేశామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఏజెన్సీల్లో నివసించే గిరిజన తల్లులు, చిన్న పెద్ద అనే తేడా లేకండా ప్రతి ఒక్కరికీ వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఏజెన్సీలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?