సాహిబ్‌జాదాల ఆత్మబలిదానం తరతరాలకు స్ఫూర్తిదాయకం

సిక్కు మత గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన సాహిబ్‌దాస్ బాబా జొరావార్ సింగ్, బాబా ఫతేసింగ్‌లు దేశాన్ని బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి చేసేందుకు చేసిన ఆత్మబలిదానాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 
 
మొఘలులకు వ్యతిరేకంగా జరిగిన కీలక పోరాటంలో గురుగోవింద్ సింగ్ నలుగురు కుమారులైన అజిత్ సింగ్, జుజ్‌హర్ సింగ్, జొరావార్ సింగ్, ఫతేసింగ్ ఆత్మబలిదానం చేశారు. వారి ఆత్మబలిదానాలకు గుర్తుగా సోమవారం మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ‘వీర్ బల్ దివస్’  కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా 300 మంది కీర్తనాకారులు పాడిన ‘శబద్ కీర్తన్’లో ప్రధానమంత్రి మోదీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ  ప్రపంచ చరిత్రలో ఎన్నో దారుణ ఘటనలు ఉన్నాయని పేర్కొంటూ మూడు శతాబ్దాల క్రితం చమ్‌కౌర్, సర్‌హింద్ యుద్ధాలు జరిగాయని గుర్తు చేశారు.
ఒకవైపు మొఘల్ సుల్తాన్‌ల గుడ్డిగా మతహింసకు పాల్పడితే, మరోవైపు మన గురువులు నిలిచారని చెప్పారు. బానిసత్వ మనస్తత్వం నుంచి దేశానికి విముక్తి కలిగిన అమృత్‌కాల్‌ను ‘వీర్ బల్ దివస్‌’గా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. గురుగోవింద్ సింగ్ కుమారులు సాహిబ్‌జాదా బాబా జొరవార్ సింగ్, బాబా ఫతేసింగ్‌ల ఆత్మబలిదానాలు మరువలేమని చెప్పారు.
సాహిబ్‌జాదాల సాహసాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, వ్యాసరచన, క్విజ్ పోటీలతో పాటు డిజిటల్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని ప్రధాని వివరించారు. సాహసం, శౌర్యం, త్యాగాలకు మారుపేరు సాహిబ్‌జాదాలకు వీర్ బల్ దివస్ సందర్భంగా జాతి ఘన నివాళులు అర్పిస్తోందని తెలిపారు.
కాగా, వీర్ బాల్ దివ‌స్ సంద‌ర్భంగా గురు గోబింద్ సింగ్‌కు, సాహిబ్‌జాదాస్‌, మాతా గుజిరికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నివాళులు అర్పించారు. మాతృభూమిని, మ‌తాన్ని ప‌రిర‌క్షించేందుకు చిన్న వ‌య‌సులోనే గురు గోబింద్ సింగ్‌కు చెందిన సాహిబ్‌జాదాలు అత్యంత సాహ‌సంతో శ‌త్రువుల‌ను ఎదుర్కొన్నార‌ని త‌న ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.
వారి ధైర్య‌సాహ‌సాలు, వీర‌త్వం మ‌న వార‌స‌త్వం  అన్న విష‌యాన్ని సంస్మ‌రించుకుంటూ మోదీ ప్ర‌భుత్వం వీర్ బాల్ దివ‌స్‌ను జ‌రుపుతోందని తెలిపారు. సాహిబ్‌జాదాలు, మాతా గుజిరి, గురు గోబింద్ సింగ్ లు ప్ర‌ద‌ర్శించిన సాహ‌సానికి, త్యాగాల‌కు నేను నివాళులర్పిస్తున్నల్టు చెప్పారు.