పోలవరంకు రూ.5036కోట్లు..కేంద్రం ఆమోదం 

గోదావరి నదిపై ఏపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసేందుకు ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.5036 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.

ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులపై ఏపి ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1948 కోట్లు కేంద్రం తిరిగి ఎపికి చెల్లించనుంది. అంతే కాకుండా వచ్చే ఏడాది మార్చి వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా భూసేకరణ, పునరావాస ప్యాకేజిలకు నిధుల చెల్లింపులకు కూడా అడ్వాన్స్‌గా రూ.3087 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.

కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఈ మేరకు నిధుల విడుదలకు సబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు నోట్‌ఫైల్ పంపారని, వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఏపి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు.