యూట్యూబ్ ఛానెళ్ల తప్పుడు సమాచారం గుట్టు రట్టు

భారతదేశంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న మూడు యూట్యూబ్ ఛానెళ్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (ఎఫ్ సి యు) గుర్తించింది. వరుసగా 40 కి పైగా నిజనిర్ధారణ కనుగొంది. ఈ యూట్యూబ్ ఛానెళ్లకు దాదాపు 33 లక్షల మంది వీక్షకులు ఉన్నారు.
 
ప్రసారం అయిన  వీడియోలు దాదాపు 30 కోట్లకు పైగా సార్లు చూశారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్ట్ లకు వ్యతిరేకంగా పిఐబి మొత్తం యూట్యూబ్ ఛానెళ్లను బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. 
 
పిఐబి  ఫ్యాక్ట్ చెక్ పరిశీలించిన యూట్యూబ్ ఛానళ్ల  వివరాల ప్రకారం: న్యూస్ హెడ్ లైన్స్ – 9.67 లక్షలు (చందాదారులు), 31,75,32,290 (వీక్షణలు); సర్కారీ అప్‌డేట్ -22.6 లక్షలు (చందాదారులు), 8,83,504 (వీక్షణలు);ఆజ్ తక్ లైవ్ 65.6 వేలు (చందాదారులు), 1,25,04,177 (వీక్షణలు).
 
సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ పథకాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు), వ్యవసాయ రుణాల మాఫీ తదితర అంశాలపై ఈ యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు, సంచలనాత్మకమైన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 
 
భవిష్యత్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించబడతాయి అని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని,  బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం నగదు అందజేస్తోంది అని, ఈవీఎం లపై నిషేధం విధించారు అంటూ అనేక వార్తలను ఈ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి.
 
తాము ప్రసారం చేస్తున్న వార్తలు, వీడియోలు వాస్తవమని చూసే వారు నమ్మేలా చూడడానికి ఈ యూట్యూబ్ ఛానెల్‌లు టీవీ ఛానళ్ల  లోగోలు, వారి న్యూస్ యాంకర్‌ల చిత్రాలతో నకిలీ, సంచలనాత్మక సూక్ష్మచిత్రాలను ఉపయోగించి వీక్షకులను తప్పుదారి పట్టించాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. 
 
ఈ ఛానెల్‌లు తమ వీడియోలలో ప్రకటనలను ప్రదర్శిస్తున్నట్లు, తప్పుడు సమాచారంతో రూపొందించిన  వీడియోలు నగదుకు విక్రయిస్తున్నట్లు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది.  సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గత ఏడాదిలో వందకు పైగా యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన తరువాత పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ చర్య తీసుకుంది.