అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఐదంచెల వ్యూహం

అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ యోచిస్తున్నారు. తమ దేశంలో అశ్రయం కోరుతూ వచ్చిన దరఖాస్తులన్నింటినీ వచ్చే ఏడాది చివరికల్లా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  ఇంగ్లీషు చానెల్‌ను దాటేందుకు ప్రయత్నించే చిన్న చిన్న బోట్లను పర్యవేక్షించేందుకు కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, అందులో వందలాదిమంది అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు.
 
“మీరు అక్రమంగా బ్రిటన్ లోకి ప్రవేశిస్తే మీరు ఇక్కడే ఉండలేరు.  మిమ్ములను మీ సొంత దేశంకైనా లేదా మీకు సురక్షిత ఆశ్రయం లభించే దేశంకైనా పంపివేస్తాం” అని సునాక్ స్పష్టం చేశారు. 
 
ఇంగ్లీష్ ఛానల్ ను దాటి వస్తున్న అక్రమ వలసదారులు గత రెండేళ్లలో రెట్టింపు అయిన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. వారిలో అత్యధికులు అల్బేనియా నుండి వస్తున్నారు.  అల్బేనియా సురక్షితమైన దేశంగా పేరొందినప్పటికీ అక్కడ నుండి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు వస్తూ వుంటారని, అందువల్ల అల్బేనియన్ల క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 
క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ఎదురుచూస్తును 10 వేల మంది శరణార్ధులకు హోటళ్ళ కన్నా తక్కువ ఖర్చు కాగల వసతి సదుపాయం కల్పించాలని కూడా సునాక్‌ ఆలోచిస్తున్నారు.  అక్రమంగా ఇక్కడకు రావడం సరికాదు, పైగా సురక్షితంగా కాదని పేర్కొంటూ, భద్రత కలిగిన దేశాల నుండి కూడా ప్రజలు ఇక్కడకు రావడం సరికాదని సునాక్‌ స్పష్టం చేశారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన ఈ మేరకుఒక ప్రకటన చేశారు. 
 
చిను బోట్ల ఆపరేషనల్‌ కమాండ్‌ ఏర్పాటు చేస్తామని, ఇందులో 700 మంది కొత్త సిబ్బంది ఉంటారని తెలిపారు. యూరప్‌లో సంఘటిత ఇమ్మిగ్రేషన్‌ నేరాలను ఎదుర్కొనడానికి గానూ బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ (ఎన్‌సిఎ)కి నిధులు రెట్టింపు చేస్తామని చెప్పారు.