
నానాటికి తగ్గిపోతున్న యువత జనాభాపై ఆందోళన చెందుతున్న పిల్లలను కనేలా ప్రజలను ప్రేరేపించడానికి పిల్లల్ని కనే జంటకు గతంలో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలకు పెంచింది. జపాన్ టుడే కథనం ప్రకారం, జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబు కటో ప్రధానమంత్రి ఫుమియో కిషిడాతో సమావేశమై గతంలో ప్రకటించిన సహాయాన్ని పెంచాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం జపాన్‌లో బిడ్డ పుడితే రూ.2.50 లక్షలకు పైగా ఆర్థిక సహాయం తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు పెంచేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. ఇది 2023 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్నది. జపాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021 లో జపాన్‌లో అత్యల్ప సంఖ్యలో పిల్లలు పుట్టారు.
దాంతో ప్రభుత్వం యువత జనాభా పెరుగుదల కోసం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జనాభా పెరుగుదల ఆవశ్యకతపై పెండ్లైన జంటలకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ జనాభా పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, గత ఏడాది జపాన్‌లో మొత్తం 8,11,604 మంది పిల్లలు పుట్టగా, ఆ ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 14 లక్షలకు పైగా ఉన్నది. జపాన్ సంక్షేమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 14న విడుదల చేసిన నివేదిక ప్రకారం జపాన్‌లో 100 ఏండ్లు దాటిన వారి సంఖ్య 86 వేలు దాటింది. వీరిలో 88 శాతం మంది మహిళలు ఉన్నారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్