
తెలంగాణాలో పార్టీ ప్రక్షాళన దిశలో ఏఐసీసీ జంబో కమిటీలు నియమించిన మరుసటి రోజే సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో సీనియర్ అయిన తనను కేవలం కార్యవర్గ సభ్యురాలిగా మాత్రమే నియమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనకు పదవులు అవసరం లేదంటూ ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల కమిటీల వరకు సుమారు 80 మంది నేతలకు పార్టీ పదవుల ఇశ్తూ అధిష్టానం జారీ చేసిన ఉత్తర్వులలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎక్కడా లేకపోవడంతో మొదటిలోనే అంతా సవ్యంగా లేదనే సంకేతం ఇచ్చింది.
పార్టీలో సీనియర్లు అందరు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, ఆయన సన్నిహితులకు ప్రాధాన్యత ఇవ్వడంతో అందరిని కలుపుకుపోయే ఉద్దేశ్యం పార్టీ అధిష్టానంకు లేదని స్పష్టమైనది.
తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు చెందిన ఏ ఒక్క లీడర్ పేరు లేకపోవడం మనస్థాపాన్ని కలిగించిందని సురేఖ తెలిపారు. పైగా, తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన కంటే జూనియర్లను నామినేట్ చేశారని ఆమె ఆరోపించారు.
తనను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లో తనను నియమించడాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ‘‘నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్యకార్యకర్తలా కొనసాగుతాను’’ అంటూ ఆమె నిర్మోహాటంగా చెప్పేసారు.
ఈ కమిటీలలో తన పేరెక్కడ లేకపోవడం పట్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మౌనం వహించారు. “నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సామాన్యకార్యకర్తలా కొనసాగుతాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుచెబుతూ ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలపై మాట్లాడతానని నర్మగర్భంగా చెప్పారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్న భవిష్యత్తులో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని చెబుతూ ఏ పార్టీ అభ్యర్థిగా చేస్తానో మాత్రం చెప్పలేదు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత