50 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోకి 5జీ సేవ‌ల విస్త‌ర‌ణ‌

దేశంలో 5జీ స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అత్యంత వేగంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు విస్త‌రిస్తున్నాయి. అక్టోబ‌ర్ 1న 5జీ లాంఛ్ అయిన త‌ర్వాత డిసెంబ‌ర్ 7 వ‌ర‌కూ 50 న‌గ‌రాల‌కు త‌మ క‌వ‌రేజ్‌ను టెలికాం ఆపరేట‌ర్లు విస్త‌రించారు.
రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్ ప్ర‌స్తుతం భార‌త్‌లో 5జీ సేవ‌ల‌ను అందిస్తుండ‌గా 2024 వ‌ర‌కూ 5జీని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు స‌న్నాహాలు చేప‌ట్టాయి. 2023 డిసెంబ‌ర్ నాటికి భార‌త్‌లోని అన్ని న‌గ‌రాలు, ముఖ్య ప‌ట్టణాల‌కు 5జీని అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు రిల‌య‌న్స్ జియో క‌స‌ర‌త్తు సాగిస్తోంది.
5జీ సేవ‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ 50 న‌గ‌రాల‌కు విస్త‌రించామ‌ని కేంద్ర టెలికాం మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ పార్ల‌మెంట్ వేదికగా వెల్ల‌డించారు. రెండు నెల‌ల్లో 50 న‌గ‌రాల‌కు 5జీ సేవ‌లు విస్త‌రించాయ‌ని చెప్పారు.  టెలికాం ఆప‌రేట‌ర్లు 5జీ ఫోన్ల‌లో ఎలాంటి టారిఫ్ పెంపు లేకుండా 5జీ క‌నెక్టివిటీని ఆఫ‌ర్ చేస్తున్నార‌ని చెప్పారు. అక్టోబ‌ర్ 1న 5జీ సేవ‌ల‌ను ప్రారంభించ‌గా వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా 12 న‌గ‌రాల్లో హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.