పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యకు చెందిన రూ. 7.93 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు తాజాగా సీజ్ చేశారు. ఈడీ అటాచ్ చేసిన వాటిలో 61 ఖాతాల్లోని బ్యాంకు బ్యాలెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి.
అటాచ్ చేసిన బ్యాంకు ఖాతాల్లో కొన్ని ఎమ్మెల్యే స్నేహితులు, బంధువుల పేర్లపై ఉన్నాయి. చట్టం కళ్లుగప్పి తప్పించుకునేందుకు మణిక్, ఆయన కుటుంబ సభ్యులు వారితో బలవంతంగా ఖాతాలు తెరిపించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఓ ఖాతా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
ఆ ఖాతా మాణిక్ భట్టాచార్య భార్య శాతరూప భట్టాచార్య, 2016లో మృతి చెందిన మృత్యుంజయ భట్టాచార్య పేరుపై ఉన్నట్టు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్య బోర్డు మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన మాణిక్ భట్టాచార్యను అక్టోబరు 10న ఈడీ అరెస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అలాగే, ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ. 49.80 కోట్ల నగదు, రూ. 5.08 కోట్ల విలువైన బంగారం, ఆభరణాలు, అలాగే, రూ. 48.22 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన సొమ్ముతో కలిపి ఈడీ ఇప్పటి వరకు రూ.111 కోట్లను సీజ్ చేసింది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం