నేపాల్‌ ఎన్నికల్లో మెజారిటీ దిశగా బహదూర్‌ దేవుబా

నేపాల్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో తాత్కాలిక ప్రధాని, నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ దేవుబా నాయకత్వంలోని కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా పయనిస్తున్నారు. శుక్రవారం ప్రకటించిన 118 సీట్లలో నేపాలీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని పాలక కూటమి 64 సీట్లను కైవసం చేసుకుంది.
కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన సిపిఎన్‌ -మావోయిస్ట్‌ సెంటర్‌, సిపిఎన్‌ -యూనిఫైడ్‌ సోషలిస్ట్‌లు వరుసగా 12, 10 సీట్లను గెలుచుకున్నాయి.  లోక్‌తాంత్రిక్‌ సమాజ్‌వాది రెండు స్థానాలను , రాష్ట్రీయ జనమోర్చాలు ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి.  ప్రస్తుత ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవుబాకు చెందిన నేపాలీ కాంగ్రెస్‌, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి చెందిన నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ మధ్య పోటీ నెలకొన్నది. 2015 లో కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలు ఇవి.
నేపాల్‌ పార్లమెంట్‌లోని మొత్తం 275 స్థానాలు, ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు (550 స్థానాలకు) ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో, 165 మంది ప్రత్యక్ష ఎన్నికలు జరగగా, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిపై ఎన్నిక జరుగుతుంది. స్పష్టమైన మెజారిటీ సాధించాలంటే పార్టీ లేదా కూటమి 138 సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది.
 ప్రత్యక్ష ఓటింగ్‌ విధానంలో నేపాలి కాంగ్రెస్‌ 39 స్థానాల్లో విజయం సాధించడంతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలికి చెందిన సిపిఎన్‌-యుఎంఎల్‌ 35 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష కూటమి సిపిఎన్‌ -యుఎంఎల్‌ 29 సీట్లను, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనసమాజ్‌వాది పార్టీలు వరుసగా నాలుగు, రెండు సీట్లను గెలుచుకున్నాయి.
నూతనంగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏడు సీట్లు, లోక్‌తాంత్రిక్‌ సమాజ్‌వాది పార్టీ మరియు జన్‌మత్‌ పార్టీలు వరుసగా రెండు, ఒక సీటు గెలుచుకున్నాయి. నాగరిక్‌ ఉన్‌ముక్తి పార్టీ రెండు సీట్లు, జనమోర్చా మరియు నేపాల్‌ మజ్దూర్‌కిసాన్‌ పార్టీలు ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. ఐదు సీట్లను స్వతంత్రులు గెలుచుకున్నారు.
 ప్రతినిధుల సభ (హెచ్‌ఒఆర్‌), ఏడు ప్రావిన్స్‌ల అసెంబ్లీలకు ఆదివారం ఓటింగ్‌ నిర్వహించగా, సోమవారం నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
రిగిన సాధారణ ఎన్నికల పోలింగ్‌ లెక్కింపు కొనసాగుతున్నది.  కాగా,  షేర్ బహదూర్ దేవ్‌బా వరుసగా ఏడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 77 ఏండ్ల దేవ్‌బా.. దడేల్‌ధురా నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి సాగర్‌ ధకల్‌పై 25,534 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.