అమెరికా భారతీయుల్లో ఎక్కువగా తెలుగు వాళ్లు 

అమెరికా భారతీయుల్లో ఎక్కువగా తెలుగు వాళ్లు 
ఈ మ‌ధ్య కాలంలో పలు దేశాలలో భార‌తీయులు రాజకీయ, పారిశ్రామిక, సామాజిక రంగాలలో కీల‌క ప‌ద‌వుల‌ని చేజిక్కించుకుని అత్యున్నత స్థానాలకు చేరుకొంటున్నారు. తాజాగా  బ్రిట‌న్ ప్ర‌ధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. 
 
మరోవంక, అమెరికాలో స్థిరపడుతున్న భారతీయుల్లో ఎక్కువగా  తెలుగు వారు ఉండటం  గమనార్హం. ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతున్నది. అమెరికాలో ఆసియన్ దేశాలను ఆధిపత్యాన్ని సైతం తెలుగు భాష వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది
త పదేళ్లలో అమెరికాలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న భాషలపై పలువురు పరిశోధనలు జరిపారు. వీరి అంచనా ప్రకారంగా తెలుగు 150 శాతం, .అరబిక్ 61 శాతం, ఉర్దూ 45 శాతం, చైనీస్ 35 శాతం,  గుజరాతి 31 శాతం మేర అభివృద్ధి చెందాయి. తెలుగు మాట్లాడే జాబితాలో మిస్ యూఎస్ నీనా దావులూరి,  మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం ఉన్నారు. 
 
అమెరికాలో ఆసియన్ దేశాల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు భాష ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం చూస్తుంటే మన భాష అక్కడి వారికి ఎంతలా పెనవేసుకు పోతుందో  వెల్లడవుతుంది. గత పదేళ్లలో 150 శాతం మేర పెరుగుదలను తెలుగు భాష సాధించిందంటే అమెరికన్లు మన భాషను ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 
 
అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 1980 1990 లో అమెరికాలో ఏర్పడిన ఐటీ బూమ్ కారణంగా భారతీయులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. నాటి నుంచి అమెరికన్ కంపెనీలన్నీ కూడా భారతీయ ఐటీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తోంది. వీరిలో ఎక్కువగా మన తెలుగు వాళ్లే ఉంటూ వస్తున్నారు.
 
యుఎస్ సెన్సస్ బ్యూరో 2012-2016 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం, ఐదేళ్లకు   విడుదలైన డేటా ప్రకారం,  అమెరికాలో ఐదు సంవత్సరాల ముందు కంటే ఎక్కువగా 3,21,695 మంది ఇంట్లో తెలుగు మాట్లాడతారు. ఇంట్లో తమిళం మాట్లాడే 2,38,699 మందితో తమిళం కూడా ఈ జాబితాలో చేరింది. తెలుగు మాట్లాడే కుటుంబాలు ఎక్కువగా  ఇల్లినాయిస్, న్యూయార్క్, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్నాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆన్‌లైన్ వీడియో ప్రకారం 2010 నుండి  2017 మధ్య తెలుగు మాట్లాడే అమెరికా నివాసితుల సంఖ్య 86% పెరిగింది. 2017లో, అమెరికాలో 4.15 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు, 2010 కన్నా దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు.  2000లో, కేవలం 87,543 మాత్రమే తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 భాషల్లో, ఏడు దక్షిణాసియాకు చెందినవి.తెలంగాణ రాజధాని హైదరాబాద్, భారతదేశం నుండి అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లను అమెరికాకు పంపుతోంది. ఎక్కువ మంది భారతీయ వలసదారులకు అమెరికా నిలయంగా మారిన నేపథ్యంలో, దేశంలోని అనేక భాషల్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్న భాషల్లో తెలుగు మాత్రమే.

అమెరికాలోని తెలుగు వారంతా మన సంస్కృతికి సాంప్రదాలయాలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలన్నీ ఏకంగా మన స్థానికతకు తగ్గట్టుగా మారిపోతున్నాయి. దీంతో అమెరికన్లు సైతం మన తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుండ‌టం తెలుగువారికే గ‌ర్వ‌కార‌ణం.