అత్యాచారం కేసులో అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శి అరెస్ట్

అత్యాచారం కేసులో అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శి అరెస్ట్
అండమాన్ నికోబార్ దీవుల్లో ఓ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో మాజీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నరైన్‌ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అండమాన్ నికోబార్ దీవుల మాజీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర నరైన్,ఇతరులు తనపై సామూహిక అత్యాచారం చేశారని 21 ఏళ్ల మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
ఈ కేసులో జితేంద్ర నరైన్ ను జిల్లా సెషన్స్ కోర్టు రిమాండుకు తరలించింది.రిమాండ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇంకా దొరకని ఇతర సహ నిందితులపై విచారణ కొనసాగించాలని పోలీసులను కోర్టు కోరింది.  ముందస్తు బెయిల్ కోసం స్థానిక కోర్టు తిరస్కరించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
అరెస్టు తర్వాత తాను కుట్రకు బలి అయ్యానని నరేన్ పేర్కొన్నాడు.ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నరైన్‌ను మూడుసార్లు ప్రశ్నించింది.  ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ప్రధాన కార్యదర్శి ఇంటికి రప్పించారని, ఆపై అక్కడ నరైన్‌తో సహా ఉన్నతాధికారులు తనపై అత్యాచారం చేశారని అండమాన్ నికోబార్ దీవుల్లోని 21 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేశారు.  దీంతో ఈ ఫిర్యాదుపై విచారణకు పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు.
ఆమె ఫిర్యాదుపై అక్టోబర్  అతను  ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ కాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 17న నరైన్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన ఆర్థిక అవసరాలను తన తండ్రి, సవతి తల్లి పట్టించుకోకపోవడంతో ఉద్యోగం కోసం తాను అప్పటి ప్రధాన కార్యదర్శిని సంప్రదించానని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
అండమాన్ దీవుల్లో సిఫార్సుల ఆధారంగా 7,800మందిని ఇంటర్వ్యూ లేకుండా నియమించారని బాధిత యువతి ఆరోపించింది.ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను ప్రధాన కార్యదర్శి ఇంటికి రప్పించారని, ఆపై ఏప్రిల్ 14, మే 1 తేదీల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది.