
మునుగోడులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక కార్యకర్త శివప్రసాద్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
ఎమ్మెల్యేలతో పాటు సామాన్యుల ఫోన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తోందని వివరించారు. రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సీపీని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 (2) నిబంధనలను ఉల్లంఘించి ప్రజల వ్యక్తిగత వివరాలను ట్యాపింగ్ చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు.
ఫోన్ ట్యాప్ చేయడంతోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‌తో కలిపి.. నవంబర్ 4న విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కూడా అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకపోయినా నగదు లావాదేవీలకు సంబంధించి అక్రమ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
More Stories
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది
కొత్తగూడెంలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు
రామ్‌గోపాల్ వర్మపై ఐపీఎస్ అంజనీ సిన్హా కేసు!