ట్విటర్‌కు పోటీగా మరో సంస్థ.. బ్లూస్కై

ట్విటర్‌కు పోటీగా మరో సంస్థ.. బ్లూస్కై

ట్విటర్‌ కు పోటీగా దాని సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాన్‌ డోర్సే మరో కొత్త సామాజిక మాధ్యమాన్ని తీసుకు వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. కొత్త సామాజిక మాధ్యమానికి బ్లూస్కై గా పేరు పెట్టారు.

ప్రస్తుతం దీన్ని ప్రవేట్‌గా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ బ్లాగ్‌లోడోర్సే స్వయంగా ప్రకటించారు. ఈ పరీక్షలు పూర్తయిన తరువాత పబ్లిక్‌ బీటా టెస్టింగ్‌ను ప్రారంభింస్తామని ఆయన వెల్లడించారు.బ్లూస్కై అథెంటికేటెడ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రోటోకాల్‌పై పని చేస్తుందని డోర్సే తెలిపారు.

ఒక్క సైట్‌ ద్వారా కాకుండా పలు సైట్ల ద్వారా దీన్ని నడపాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ను బ్లూస్కై పేరుతో ప్రారంభించామని చివరకు కంపెనీ పేరుగా దాన్నే కొనసాగించాలని నిర్ణించినట్లు తెలిపారు. బ్లూస్కై పేరు విస్తృతమైన అవకాశాలకు సూచినని ఆయన వివరించారు.

సామాజిక మాధ్యమాల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని, చూజర్ల డేటాను హస్తగతం చేసుకోవాలనుకునేవారికి బ్లూస్కై ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని డోర్సే వెల్లడించారు. పరోక్షంగా ట్విటర్‌కు పోటీగానే ఆయన దీన్ని తీసుకు వస్తున్నట్లు టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత సంవత్సరం నవంబర్‌లో జాన్‌ డోర్సే ట్విటర్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుని పరాగ్‌ అగర్వాల్‌కు అప్పగించారు. కొంత కాలం తరువాత ఆయన బోర్డు నుంచి కూడా వైదొలగారు. ట్విటర్‌తో ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారు.

ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడాన్ని డోర్సే స్వాగతించారు. ట్విటర్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా కొనసాగడం కంటే, దాన్ని ప్రవేట్‌గా మారిస్తేనే మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ఇప్పుడు ఆయనే స్వయంగా మరో సోషల్‌ మీడియా సంస్థకు ప్రారంభించనున్నారు.