దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 151కి పెరిగింది. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా సియోల్‌లోని ఇటావోన్ ప్రాంతంలో ఇరుకైన వీధి గుండా వేలాది మంది ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
కాగా, మృతులు, గాయపడినవారిలో ఎక్కువగా 20 ఏండ్ల లోపు వయస్సున్న యువతే ఉన్నారని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారని, మరో 15 మంది ఇతర దేశాలకు చెందినవారు గాయపడ్డారని తెలిపారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్న వారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు.
సమీపంలో ఉన్న బార్‌కు వచ్చిన సినీ సినీతారను చూసేందుకు జనం పరుగులు తీయడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
కరోనా ఆంక్షాలను తొలగించిన తర్వాత తొలిసారిగా హాలోవీన్ వేడుకలు జరుగుతుండటంతో దాదాపు లక్ష మంది ప్రజలు ఈ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఘటనపై దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

More Stories
నేపాల్‌లో మళ్లీ జెన్ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం
భారత్‌లో భారీ దాడులకు జైషే విరాళాల సేకరణ