
టిఆర్ఎస్ నుండి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్ బుధవారం ఢిల్లీలో బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ లసమక్షంలో డా. బూర నర్సయ్య గౌడ్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బూర నర్సయ్యతో పాటు వడ్డేపల్లి రాజేశ్వరరావు, రవి ప్రకాశ్ యాదవ్, హరిశంకర్ గౌడ్ సహా మొత్తం 16 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను తనతో పాటు బీజేపీలో చేర్పించారు. పార్టీ సభ్యత్వ నమోదు రసీదును బూర నర్సయ్యకు కేంద్ర మంత్రులిద్దరూ అందజేశారు. పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకున్న తర్వాత సాయంత్రం కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలతో విడివిడిగా సమావేశమయ్యారు. వారిద్దరూ డా. బూర నర్సయ్య గౌడ్‌ను, ఆయనతో పాటు వచ్చినవారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా డా. గౌడ్ చెప్పారు. తాను ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను భువనగిరికి తీసుకువచ్చానని చెప్పారు. సబ్ కా సాత్… సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళతానని ఆయన తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ‘అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ’ కోసం పనిచేస్తానని వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషిచేస్తానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షలతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు అవసరమని చెప్పారు. మునుగోడులో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
More Stories
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్