దేశంలో మొట్టమొదటి అల్యూమినియం సరకు రేక్ ప్రారంభం 

భారతదేశపు మొట్టమొదటి అల్యూమినియం సరకు రేక్ – 61 BOBRNALHSM1ని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దేశీయంగా `భారత్ లో తయారీ’ కార్యక్రమంలో భాగంగా  రైల్వేలు, బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్, హిందాల్కో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ రైలు సాంప్రదాయ సరకు రవాణా రైళ్ల కంటే అల్యూమినియం రేక్ అనేక ప్రయోజనాలను కలిగి ఉందని తెలిపారు.
అల్యూమినియం రేక్ యొక్క లక్షణాలు:  సూపర్స్ట్రక్చర్పై వెల్డింగ్ లేకుండా పూర్తిగా లాక్బోల్టెడ్ నిర్మాణం, టారే సాధారణ స్టీల్ రేక్ల కంటే 3.25 టన్నులు తక్కువగా ఉంటుంది, ఒక్కో వ్యాగన్ 180 టన్నుల సామర్థ్యంతో అదనపు సామర్థ్యంకల్గి ఉంటుంది . పేలోడ్ నుండి టారే నిష్పత్తి 2.85.
 
ఒక రేక్ దాని జీవితకాలంలో 14,500 టన్నుల CO2ని ఆదా చేస్తుంది. సరకు రవాణాలో తిరుగు ప్రయాణములో ఇంధనం ఎంతో తక్కువ వినియోగం మరియు లోడ్ చేయబడిన స్థితిలో ఎక్కువ సరుకు రవాణా చేయడం వలన కార్బన్ పాదముద్రను తగ్గిస్తుంది.  రేకుల పునఃవిక్రయం విలువ 80 శాతం.
ఈ సూపర్ స్ట్రక్చర్ అంతా అల్యూమినియం తో నిర్మించడంతో సరకు రవాణా ధర 35 శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక తుప్పు, రాపిడి నిరోధకత కారణంగా నిర్వహణ ఖర్చు తక్కువగా  ఉంటుంది.  ఇనుము పరిశ్రమ దిగుమతి నుండి వచ్చే నికెల్, కాడ్మియంను చాలా వినియోగిస్తుంది.
కాబట్టి, అల్యూమినియం వ్యాగన్ల విస్తరణ తక్కువ దిగుమతికి దారి తీస్తుంది. అదే సమయంలో, ఇది స్థానిక అల్యూమినియం పరిశ్రమకు ఒక ఊతంగా నిలవనుంది.