ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశాలలో పాకిస్తాన్ ఒకటి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో బైడెన్ ఈ కామెంట్ చేశారు.
ఆ సమావేశంలో చైనా, రష్యా తీరును కూడా ఆయన ఖండించారు. చైనా అధ్యక్షుడు తన దేశ స్వార్ధం కోసం ఏమైనా చేస్తారని, ఈ క్రమంలో ప్రపంచ మానవాళికి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని బైడెన్ మండిపడ్డారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి దిగిన రష్యా అక్కడ రక్తపాతం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనా, రష్యాతో ఉన్న విదేశాంగ విధానంపై మాట్లాడుతున్న సమయంలో పాక్‌పై బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ ఈవెంట్‌లో బైడెన్ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌజ్ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించారు. బైడెన్ వ్యాఖ్యల వల్ల పాక్ పరిస్థితి దయనీయంగా మారింది.
అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఆ వ్యాఖ్యలు పాక్‌కు శాపంగా మారనున్నాయి. 21వ శతాబ్ధం రెండవ క్వార్టర్‌లో అమెరికాను డైనమిక్‌గా మార్చేందుకు అనేక అవకాశాలు ఉన్నట్లు బైడెన్ తెలిపారు.
అయితే, ఇటీవల విడుదల చేసిన 48 పేజీల జాతీయ భద్రతా వ్యూహం పత్రంలో పాకిస్థాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. చైనా, రష్యా వల్ల అమెరికాకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆ పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం.

More Stories
నేపాల్‌లో మళ్లీ జెన్ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం
భారత్‌లో భారీ దాడులకు జైషే విరాళాల సేకరణ