
ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ దక్కింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ అక్యూటీ పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బహుమతి దక్కింది. 1974లోనే రచనలు మొదలుపెట్టిన ఎర్నాక్స్ ఈ ఏడాది తన 82వ ఏట నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. సాహిత్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఎర్నాక్స్ ప్రధానంగా ఆటోబయోగ్రఫీలు రాశారు.
తన తల్లిదండ్రులతో తన అనుబంధం, తదనంతరం తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఆధారంగా రచనలు చేశారు. తొలుత ఫిక్షన్ నవలలతోనే తన ప్రస్థానం మొదలుపెట్టినా, ఆ తర్వాత ఆటోబయోగ్రఫీల దిశగా ఆమె మారిపోయారు. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారామె. 1940లో ఆమె నార్మాండీలోని యెవటోట్‌లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?