దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాల గుట్టు రట్టు

శిక్షణ, సేవ ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు ఉతమిచేవిధంగా పాపులర్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఎ) సాగిస్తున్న కార్యకలాపాల తీగ నిజామాబాదులో తాగితే దేశవ్యాప్తంగా ఆ సంస్థ కా ర్యకలాపాల డొంగ కదులుతోంది. నిజామాబాద్‌లో విస్తృంగా సోదాలు జరిపిన తర్వాత ఎన్‌ఐఎ బృందాలు శుక్రవారం దేశవ్యాప్తంగా విరుచుకుపడ్డాయి.
 
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, శిక్షణ వంటి ఆరోపణలపై దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యాలయాలు, సభ్యుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఏ) సంస్థ సోదాలు నిర్వహించింది. పీఎఫ్‌ఐకి చెందిన 106 మందిని అరెస్ట్‌ చేసింది. 15 రాష్ర్టాల్లోని 93 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. పీఎఫ్‌ఐ చైర్మన్‌ ఓఎమ్‌ఏ సలాంను కూడా అరెస్ట్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.
 
ఎన్‌ఐఏ చరిత్రలోనే అతిపెద్ద దర్యాప్తుగా దీన్ని పేర్కొంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా సోదాల్లో పాల్గొన్నది. కేరళలో 22, మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20, తమిళనాడులో 10, అస్సాంలో 9, ఉత్తరప్రదేశ్‌లో 8, ఆంధ్రప్రదేశ్‌లో 5, మధ్యప్రదేశ్‌లో 4, పుదుచ్చేరిలో 3, ఢిల్లీలో 3, రాజస్థాన్‌లో ఇద్దరిని అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. అరెస్టులకు నిరసనగా కేరళలో ధర్నాలు చేపడతామని పీఎఫ్‌ఐ రాష్ట్ర యూనిట్‌ బెదిరించింది.

దాదాపు 300 మంది అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఈ మెరుపు దాడులు ప్రారంభించారు. అత్యధికంగా కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో 20 చొప్పున, తమిళనాడులో 10 మంది, అసోంలో 9, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, పుదుచ్చేరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సోదాల్లో పలు పత్రాలను, ఆయుధాలను, ఇస్లామిక్‌ ఉగ్రవాద సాహిత్యాన్ని, కంప్యూటర్లను, ల్యాప్‌టా్‌పలు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.. వీరంతా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నిర్వహించడం, ఆయా ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి నేరాలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. వారి హింసాత్మక చర్యలతో ప్రజల మనసులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని ఎన్‌ఐఏ తన ప్రకటనలో వివరించింది.
 
ఆర్థిక లింకులపై ఈడీ ఆరా
 
2020లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల వెనుక, యూపీలోని హత్రా్‌సలో దళితమహిళపై సామూహిక హత్యాచారం ఘటన నేపథ్యంలో మతవిద్వేషాలు రేపే కుట్ర వెనుక పీఎ్‌ఫఐ ఆర్థిక లింకులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ సంస్థ దుబాయ్‌, ఒమన్‌, కతార్‌, కువైట్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, నిధులు వసూలు చేసి హవాలా మార్గంలో భారత్‌కు తరలించిందని వెల్లడించింది.
 
మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నదని గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సంస్థపై ఈడీ తొలి కేసు నమోదు చేసింది.పిఎఫ్ఐ పైన,  ఆ సంస్థ పదాధికారులపైన లఖ్‌నవూలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం) కోర్టులో రెండు అభియోగపత్రాలు దాఖలు చేసింది.  వీటిలో ఒకటి గత ఏడాది ఫిబ్రవరిలో దాఖలు చేసింది.
 
2020లో హత్రా్‌సలో దళిత మహిళ సామూహిక హత్యాచారం అనంతరం మతవిద్వేషాలు రేపడానికి, తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించడానికి పీఎ్‌ఫఐ, ఆ సంస్థ సభ్యులు కృషి చేశారని అందులో పేర్కొంది. ఇందుకు అవసరమైన వనరుల కోసం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించింది.
 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ సంబంధించిన ప్రాంగణాల్లో జరుగుతున్న సోదాలు, ఉగ్రవాద అనుమానితులపై చర్యలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు.

ఏమిటీ పీఎఫ్‌ఐ?

నేడు దేశంలో నెలకొన్న అత్యంత ప్రమాదకరమైన సంస్థలలో ఇదొక్కటి. దీని కార్యకలాపాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో మతసామరస్యానికి భంగం కలిగించడమే కాకుండా దేశ సమగ్రతకు, దేశ రక్షణకు సహితం ప్రమాదకారిగా మారింది. కేరళ నుండి నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్ (ఎన్ డి ఎఫ్), కర్ణాటక నుండి ఫోరమ్ ఫర్ డిగ్నిటీ, తమిళనాడు నుండి ఎం ఎన్ పి లను విలీనం చేసిన తర్వాత 2006లో కేరళలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
ఉగ్రవాద సంస్థ సిమిని భారతదేశంలో నిషేధించినప్పుడు, దాని సభ్యులు పిఎఫ్‌ఐలో చేరారని కూడా భావిస్తున్నారు. మొదటి నుంచీ పిఎఫ్‌ఐ మత అల్లర్లను రెచ్చగొట్టి విద్వేష వాతావరణాన్ని సృష్టిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

2014లో కేరళ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, కేరళలో 27 రాజకీయ హత్యలు, 106 మతపరమైన సంఘటనలకు పిఎఫ్ఐ కార్యకర్తలు బాధ్యులు. కేరళలోని 100 మందికి పైగా బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల పేర్లను పిఎఫ్‌ఐ సభ్యులు హత్యకు షార్ట్‌లిస్ట్ చేశారని తాజాగా కేరళ పోలీస్ దర్యాప్తులో వెల్లడైనది.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త ఎస్‌కె శ్రీనివాసన్ హత్యపై కేరళ పోలీసుల దర్యాప్తులో శ్రీనివాసన్ హత్యకు ముందు పిఎఫ్‌ఐ సభ్యులు కనీసం 100 మంది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారని తేలింది. ఈ జాబితాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ కృష్ణకుమార్, బీజేపీ యువనేత ప్రశాంత్ శివన్ పేర్లు ఉన్నాయి. కేవలం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలే మాత్రమే కాకుండా సీపీఎం, ఐయూఎంఎల్  కార్యకర్తలు కూడా వీరి దాడులకు లక్ష్యాలుగా ఉన్నారు.

2018లో కేరళ ఎర్నాకుళంలోని ఓ కళాశాలలో ఎస్ఎఫ్ఐ నాయకుడు అభిమన్యు హత్య సహితం పిఎఫ్ఐ పనేగాని వెల్లడైనది. పైగా, ఎస్డీపీఐ కార్యకర్తలు అనేక రాజకీయ పార్టీల ఫీడర్ సంస్థలలోకి చొరబడ్డారని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అయితే ఇటువంటి హెచ్చరికలను రాజకీయ పార్టీలు తిరస్కరిస్తూ వచ్చినా, ఇప్పుడు అవి సహితం వాటికి లక్ష్యంగా మారాయి.

ఎస్‌డిపిఐని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని సీనియర్ ముస్లిం లీగ్ నాయకుడు పికె కున్హాలికుట్టి పేర్కొనడం ఈ సందర్భంగా సమస్య తీవ్రతను వెల్లడిస్తుంది. అయితే కేరళలోని సిపిఎం ప్రభుత్వం మాత్రం ఈ విషయమై స్పందించడం లేదు. కర్ణాటకలో గత జులైలో హత్యకు గురైన యువమోర్చ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకేసులో ఓ నిందితుడి భార్య తన భర్త పిఎఫ్ఐ కార్యకర్త అని పోలీస్ విచారణలో చెప్పడం గమనార్హం.

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)లు ఉగ్రసంస్థలు అని, పలు హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొంటున్నాయని, అయితే వాటిని నిషేధించలేదని కేరళ హైకోర్టు ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. ఈ నెల మొదట్లో బీహార్‌లోని 30 ప్రదేశాలలో జరిపిన సోదాలలో సహితం ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలలో పిఎఫ్ఐ పాత్ర వెల్లడైనది. దేశంలోని మావోయిస్టు సంస్థలు పిఎఫ్ఐతో వ్యూహాత్మక సంబంధాలు కలిగి ఉన్నట్లు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.