
గురుగ్రామ్‌లోని నార్త్‌క్యాప్ యూనివర్శిటీతో కలిసి విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఇతర రంగాలలో చోటుచేసుకుంటున్న సాంకేతిక పరిజ్జాన అంశాలపై స్వల్ప, మధ్య కాలిక కోర్సుల నిర్వహణ, పరిశోధన చేపట్టేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఏటి) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సుల నిర్వహణ, పరిశోధన కార్యక్రమాలపై కుదిరిన ఒప్పందంపై ఐసిఏటి డైరెక్టర్ శ్రీమతి పమేలా టిక్కూ , నార్త్‌క్యాప్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ నుపుర్ ప్రకాష్ సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన శ్రీమతి పమేలా టిక్కూ విద్యుత్ వాహనాల తయారీ రంగానికి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఐసిఏటి తో కలిసి పని చేస్తామని తెలిపారు. వాహన తయారీ రంగంలో ఐసిఏటి అపారమైన అనుభవం కలిగి ఉందని నార్త్‌క్యాప్ యూనివర్శిటీ ఉప కులపతి ప్రొఫెసర్ నుపుర్ ప్రకాష్ తెలిపారు. విద్యా రంగంలో నార్త్‌క్యాప్ యూనివర్శిటీ తనకంటూ గుర్తింపు పొందిందని చెప్పారు.
ఐసిఏటితో కలిసి భారతదేశంలో వాహన తయారీ రంగానికి అవసరమైన వివిధ నిపుణులను సిద్ధం చేసేందుకు అవసరమైన కోర్సులకు రూపకల్పన చేసి అందిస్తామని పేర్కొన్నారు. మనేసర్ కేంద్రంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఏటి), 1996లో ఏర్పాటయింది.
ఆటోమొబైల్స్, వాటి కీలకమైన భద్రతా భాగాల టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ కింద కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గుర్తించి నోటిఫై చేసిన స్వతంత్ర పరీక్షా ఏజెన్సీలలో ఐసిఏటి ఒకటి. నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం 1996లో గురుగ్రామ్‌లో స్థాపించారు.
నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) ‘ఎ’ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద ఈ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 100 విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది.
ఇన్నోవేషన్ అచీవ్‌మెంట్ 2021 (ఎఆర్ఐఐఎ)లో అటల్ ర్యాంకింగ్ పొందిన యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీ తరగతిలో 30 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం స్థానం సాధించింది. భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న విశ్వవిద్యాలయంగా సంస్థ గుర్తింపు పొందింది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, అప్లైడ్ సైన్సెస్, లా వంటి విభాగాలలో వివిధ రకాల అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను విశ్వవిద్యాలయం అందిస్తుంది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (ఎఐయు), అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ యూనివర్శిటీస్, యూకే లలో నార్త్‌క్యాప్ విశ్వవిద్యాలయం సభ్యత్వం కలిగి ఉంది .
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు