పంజాబ్ పోలీసులు సకాలంలో అప్రమత్తం కావడంతో భారీ పేలుడు ఘటన తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ దిల్ బాగ్ సింగ్ కారు కింద కొందరు అగంతకులు అమర్చిన ఐఈడీని బాంబ్ స్క్వాడ్ సకాలంలో తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఉదయం కారును కడిపేందుకు వచ్చిన వ్యక్తి ఐఈడీని గమనించి దిల్ బాగ్ సింగ్‌ను అప్రమత్తం చేయడం, ఆయన వెంటనే ఐఈడీని కనిపెట్టి బాంబు స్క్వాడ్‌ను రప్పించడంతో వెంటనే వారు దానిని నిర్వీర్వం చేశారు.
కాగా, దిల్ బాగ్ సింగ్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అగంతకులు ఆయన కారు కింద గత రాత్రి భారీ పేలుడు సామర్థ్యం ఉన్న బాంబును అమర్చినట్టు గుర్తించారు. బైక్‌పై వచ్చిన అగంతకులు బాంబు అమర్చిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.
వీరు తెల్లడి కుర్తాలు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దిల్ బాగ్ పనిచేస్తున్నందున ఆయనను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని ఉండవచ్చనే కోణం నుంచి పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సువ్ ఇంజన్ స్టార్ చేయగానే బాంబు పేలేలా అగంతకులు దానిని అమర్చినట్టు వారు చెబుతున్నారు. ఐఎస్ఎస్ఎస్ టెర్రర్ మాడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే పంజాబ్ పోలీసులు భగ్నం చేసిన క్రమంలో తాజా ఘటన చేసుకోవడం సంచలనమైంది.

More Stories
కరోనా టీకాలతో హుద్రోగాలు పెరగలేదు.. ఐసిఎంఆర్
భారతీయ నావికుడు మృతిపై ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ముగ్గరు షూటర్లు అరెస్ట్