
వెయ్యేళ్ల పూర్వం నాటి ఐదు అత్యంత ప్రాచీన విగ్రహాలతో సహా 8 విగ్రహాలను తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన స్వామిమలైలోని ఒక రహస్య స్థావరంలో తమిళనాడు విగ్రహాల విభాగానికి చెందిన సిఐడి అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
200 కిలోల బరువైన భోగశక్తి అమ్మవారి విగ్రహం, రెండు బుద్ధుని విగ్రహాలు, ఆండాళ్, విష్ణుమూర్తి విగ్రహాలు&వెయ్యేళ్ల పూర్వం నాటివిగా భావిస్తున్న ఐదు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవేగాక వందేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న నటరాజ విగ్రహంతోపాటు శివగామి అమ్మవారు, రమణ మహర్షి విగ్రహాలు కూడా ఈ దాడిలో లభించాయి.
స్వాధీనం చేసుకున్న అ అపురూపమైన విగ్రహాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో అనేక కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. శివకంచిలో జరిగిన విగ్రహాల చోరీ కేసులో నిందితునిగా ఉన్న జి మాశిలామణి నివసించే కోడంబాకంలోని ఆయన ఇంట్లో అధికారులు సోదా జరపగా ఎటువంటి ఫలితం దక్కలేదు.
అయితే ఈనెల 9న సెర్చ్ వారెంట్‌తో స్వామిమలై వెళ్లి మాశఙలామణికి చెందిన రహస్య స్థావరంపై అధికారులు దాడులు జరపగా ఈ విగ్రహాలు లభించాయి.
More Stories
నాగపూర్ హింసాకాండపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం
నాగ్పుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ
మణిపూర్ హింసాకాండ కేసులన్నీ గౌహతికి బదిలీ