ఎన్‌ఆర్‌ఐలకు ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం

ఎన్‌ఆర్‌ఐలకు ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం

సీనియర్‌ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ)  కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్‌) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్,  తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్-బోర్డర్ ఇన్‌వర్డ్ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనుంది.  తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్‌ఆర్‌ఐలకు లభించనుంది.

దీంతో ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారీ ఊరట కలగనుంది. దీనికిసంబంధించి విధి విధానాలను  త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్‌ చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం  ఎన్‌ఆర్‌ఐలను భారతదేశంలోని తమ  కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే సులభంగా చేసుకోవచ్చు.

ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న ఈ ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్‌ సిటిజన్లకు పయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

ఆర్బీఐ తీసుకొచ్చిన డిజిటల్‌ పేమెంట్‌వ్యవస్థ బీబీపీఎస్‌. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో ఇది సేవలందిస్తుంది. అన్ని బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడే వన్‌స్టాప్‌ సొల్యూషన్‌. భారత్ బిల్‌పే ద్వారా కార్డ్‌లు (క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్), నెఫ్ట్  ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపిఇ, వాలెట్‌లు, ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఉపయోగపడుతుంది.

అలాగే విద్యుత్, టెలికాం, డీటీహెచ్‌, గ్యాస్, నీటి బిల్లు, వివిధ రకాల యుటిలిటీ బిల్లులను  బీబీపీఎస్‌ ద్వారా చెల్లించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్, బీమా ప్రీమియంలు,  స్కూలు  ఫీజులు,  ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు, లోకల్‌ టాక్స్‌,  హౌసింగ్ సొసైటీ బకాయిలు తదితర చెల్లింపులకు వినియోగించే సింగల్‌ విండో సిస్టం బీబీపీఎస్‌.

మరోసారి వడ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ 
 
కాగా, ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచింది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ పెంచింది. దీంతో హోమ్ లోన్, వాహనాల లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.  ద్రవ్యోల్బణం అదుపులోకి తెచ్చేందుకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు కీలక రుణ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 
కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బిఐ రెపో రేటును పెంచడం ఇది మూడవసారి. ఆర్‌బిఐ మేలో 40 బేసిన్‌ పాయింట్ల పెంపుతో పాటు జూన్‌ దైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచింది. తాజాగా ఈ నెల 3న ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల మేరకు మరో 50 బేసిన్‌ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
 
జూన్ 8న ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. అంటే మొత్తం 140 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెరిగింది. అంటే 1.40 శాతం వడ్డీ పెరిగింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై  వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది.