
ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తి శద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ గారు విసృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ యం.పి. అసదుద్దీన్ ఓవైసి ప్రజలు కట్టిన పన్నులు వృధా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిందువులు దేవాలయాలలో సమర్పించిన లక్షలాది కోట్ల రూపాయల నుండే హిందూ పండుగలకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కానీ ప్రజలు కట్టిన పన్నుల నుండి కాదని ఓవైసి తెలుసుకోవాలని . తెలంగాణా ప్రభుత్వం కూడా హిందూ పండుగలకు దేవాదాయ శాఖ నుండే నిధులు మంజారు చేస్తుంది. ప్రార్ధనా స్థలాల యాత్రలకు సబ్సిడీలు, పండుగలకు విందులు, ప్రార్ధనా స్థలాల మరమత్తులకు తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండి ఓవైసీ భాషలో చెప్పాలంటే ప్రజలు కట్టిన పన్నుల నుండి ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదని అసదుద్దీన్ ఓవైసి తెలంగాణా ముఖ్యమంత్రి కి లేఖ రాయాలని, తమ మిత్రపక్షం టి.ఆర్.యస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృద్దా చేయకుండా ఓవైసి కట్టడి చేయాలి. హిందూ పండుగలపై
అసత్యప్రచారాలు ఓవైసి మానుకోవాలని హెచ్చరించింది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి