టాలీవుడ్ గాయని శ్రావణి భార్గవి ఇటీవల విడుదల చేసిన అన్నమాచార్య కీర్తన ` ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై … ‘ పాట పెను వివాదం సృష్టిస్తోంది. ఆమె విడుదల చేసిన అల్బుల్లో ఈ పాట పాడుతూ అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి ఘాటుగా స్పందించారు.
“శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలి. తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు..” అంటూ ఆమె శ్రావణి భార్గవిని నిలదీశారు.
శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు? ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు అంటూ ఆమె హితవు చెప్పారు. కె.విశ్వనాథ్ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు తాను పుట్టలేదని, వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే అని కళ్యాణి స్పష్టం చేశారు.
” భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్ చేయాల్సిందే!”‘ అని కరాఖండిగా తేల్చి చెప్పారు. మరోవైపు ఏదేమైనా తన పాటను తొలగించనని చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు సర్వత్రా విమర్శలు చెలరేగడంతో తలవంచి ఆ పాటను తొలగించడం గమనార్హం.

More Stories
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!
తేజస్వీ సీఎం అయితే కిడ్నాపింగ్, వసూళ్లు, హత్య మంత్రిత్వ శాఖలు
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు