
జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా కలర్ ఫోటో ఎంపికైంది. అలాగే ఉత్తమ కొరియోగ్రఫీ చిత్రం ‘నాట్యం’, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి.
శుక్రవారం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్‌ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు.
ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవగన్లు నిలిచారు. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళి ఎంపికయ్యారుు. తమిళ చిత్రం సూరారై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) పలు అవార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 30 భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చాయి. మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్ నిలిచింది.
అలాగే నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటరిగిలో 148 చిత్రాలు (20 భాషల్లో )స్క్రీనింగ్ వచ్చినట్లు జ్యూరీ మెంబర్స్ తెలిపారు. ఈ ఏడాది అవార్డులను ఐదు కేటగిరీలుగా విభజించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డలు ప్రకటించారు.
“అవార్డులు ప్రకటించిన క్షణం నుంచి ఫొన్ మోగుతూనే ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆనందంతో నోట మాట రావట్లేదు. చిన్న బడ్జెట్‌లో కష్టపడి సినిమా తీశాం. ప్రేక్షకులు ఆదరించారు. అవార్డు వరిస్తుందని ఊహించలేదు’’ అంటూ కలర్ ఫోటో దర్శకుడు సందీప్‌రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
* మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ – మధ్యప్రదేశ్
* ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): – తమన్ (అల వైకుంఠపురములో)
* ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు -తమిళ్)
* బెస్ట్ ఫీచర్ ఫిలిం: సూరరై పోట్రు
* బెస్ట్ స్టంట్స్ – అయ్యప్పనుమ్ కోషియమ్
* ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు)
* ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు – నాట్యం
* ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివరంజనీయం ఇన్నుమ్ శిల పెంగళమ్)
* ఉత్తమ సహాయ నటుడు: బిజు మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్- మలయాళం)
* ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు- తమిళ్)
* ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు)
* ఉత్తమ నటుడు (షేర్‌డ్): అజయ్ దేవ్‌గణ్ (తానాజీ: ది అన్‌సంగ్ వారియర్- హిందీ)
* ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (అయ్యప్పనుమ్ కోషియుమ్)
* ఉత్తమ పిల్లల చిత్రం: సుమి(మరాఠి)
* బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: నాంచమ్మ (అప్పయ్యప్పనుమ్ కోషియమ్- మలయాళం)
* బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: రాహుల్ దేశ్‌పాండే (మీ వసంతరావు – మరాఠీ)
*ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్)
* ఉత్తమ మలయాళ చిత్రం: థింకలియా నిశ్చయమ్
* ఉత్తమ కన్నడ చిత్రం: డొల్లు
* ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్
* ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): అయ్యప్పనుమ్ కోషియమ్ (మలయాళం)
* ఉత్తమ లిరిక్స్: సైనా(హిందీ) – మనోజ్ ముంతషిర్
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నచికెత్ బర్వె, మహేశ్ షెర్లా (తానాజీ: ది అన్‌సంగ్ వారియర్)
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం)
* ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ -తమిళ్)
* బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): జాబిన్ జయన్ (డోలు- కన్నడ)
* బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అన్మూల్ భావే (మీ వసంతరావు- మరాఠీ)
* బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్‌డ్ ట్రాక్: విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మలిక్- మలయాళం)
* బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్):షాలిని ఉషా నాయర్, సుధా కొంగర (సూరరై పోట్రు – తమిళ్)
* బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : మడోన్నా అశ్విన్ (మండేలా- తమిళ్)
* బెస్ట్ సినిమాటోగ్రఫీ: సుప్రతీమ్ భోల్ (అవిజాత్రిక్- బెంగాలీ)
* ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: అనీష్ మంగేశ్ గోసావి (టక్ టక్- మరాఠీ), ఆకాంక్ష పింగ్లే, దివఏశ్ ఇందుల్కర్ (సుమీ- మరాఠీ)
* బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్‌మెంట్ కంజర్వేషన్: తాలెడండ(కన్నడ)
* బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: ఫ్యునెరల్ (మరాఠి)
* బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్: తానాజీ: ది అన్‌సంగ్ వారియర్
* ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మడోన్న అశ్విన్ (మండేలా- తమిళ్)
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి