
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరును ప్రకటించారు. జగదీప్ ధన్‌కర్ (71)ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జగదీప్ ధన్‌కర్ పేరును ఖరారు చేస్తూ అధికారికంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన చేశారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరిగిన అనంతరం ఆయన పేరును నడ్డా వెల్లడించారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు “అన్ని పరిశీలనలు, సంప్రదింపుల తర్వాత, కిసాన్ పుత్ర (రైతు కుమారుడు) జగదీప్ ధన్‌ఖర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి, ఎన్‌డిఎ అభ్యర్థిగా ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాము” అని నడ్డా చెప్పారు.
ధన్‌ఖర్ పరిపాలనాదక్షులు, రాజ్యాంగ విషయపరిజ్ఞానులు, చట్టసభల వ్యవహారాలతో సముచిత అనుభవజ్ఞులుగా ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వానికి తమ మద్దతు అని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీటు లో తెలిపారు. రాజ్యసభ నిర్వాహక బాధ్యతల్లో ఆయన రాణిస్తారని ఈ నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ ప్రగతి దిశలో సాగే పయనానికి ఆయన తమ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సభ్యుడు అయిన ధన్‌ఖర్ హై ప్రొఫైల్ కేసులతో పోరాడటానికి ప్రసిద్ది చెందారు. రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ న్యాయవాది.
ధన్‌ఖర్ జగదీప్ ధన్‌కర్ ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా ఎదిగి న్యాయనిపుణుడిగా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకున్నారు. కాలినడకనే రోజూ 4 నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్లి చదువుకునేవాడినని పలు ఇంటర్వ్యూల్లో గుర్తు చేసుకునేవారు ఆయన. అంతేకాదు పిల్లలంటే ఆయనకు ఎంతో మమకారం.
గవర్నర్‌గా విధులు నిర్వహించే సమయంలోనూ వీలు చేసుకుని మరీ విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లి మరీ వాళ్లను ప్రోత్సహించేలా ఉపన్యాసాలు ఇచ్చేవారాయన.
బిజెపిలో చేరడానికి ముందు, అతను 1989-91 సమయంలో రాజస్థాన్‌లోని జుంజును నుండి పార్లమెంటు సభ్యుడు. ఆయన జనతాదళ్ సభ్యుడు. 1991లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అతను 1993-98 మధ్య రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నుండి శాసనసభ సభ్యుడు కూడా వ్యవహరించారు.
జగదీప్ వృత్తిరీత్యా న్యాయవాది. 1989లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన . జూలై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990లో రాజస్థాన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన జగదీప్ ధన్‌ఖర్ అప్పటి నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు.
సుసమ్స్ ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సుదేష్ ధంఖర్‌ని వివాహం చేసుకున్నాడు. ఆమె సామాజిక కార్యకర్త. వారి కుమార్తె కమ్నాను సుప్రీంకోర్టు న్యాయవాది కార్తికేయ వాజ్‌పేయి వివాహం చేసుకున్నారు.
ఈ ఎన్నికలలో తమ అభ్యర్ధిని బిజెపి సునాయానంగా గెలిపించుకునే అవకాశం ఉంది. గెతదుపరి ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసే ఎలక్టోరల్ కాలేజీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. పార్లమెంటు ప్రస్తుత బలం 780లో, బీజేపీకి మాత్రమే 394 మంది ఎంపీలు ఉన్నారు. మెజారిటీ మార్క్ 390 కంటే ఎక్కువ.
ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవి కాలం ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జులై 19వ తేదీ.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు