
తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నది. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ ఎప్పటి మాదిరిగానే కొనసాగుతుంది.
ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది.
రైలు నంబర్ 07297 కాచిగూడ నుంచి తిరుపతికి జూలై 13, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
మార్గమధ్యంలో ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07298 తిరుపతి నుంచి కాచిగూడకు జూలై 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుతుంది.
రైలు నంబర్ 07569 హైదరాబాద్ నుంచి తిరుపతికి జూలై 8న ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుతుంది.
ఈ రైలు దారిలో సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. రైలు నంబర్ 07570 తిరుపతి నుంచి హైదరాబాద్‌కు జూలై 9న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం రాత్రి 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు