
‘కాళి’ పేరుతో విడుదలైన ఓ డాక్యుమెంటరీ పోస్టర్ పై వివాదం రాజుకుంది. డైరెక్టర్ లీనా మణిమేకలై తాజాగా సోషల్ మీడియాపై రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం ‘కాళీ’ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో కాళీమాత గెటప్ లో ఉన్న నటి ఒక చేతితో త్రిశూలం పట్టుకుని, మరో చేతితో సిగిరెట్ తాగుతున్నట్లు ఉంది.
మరో చేతితో ఎల్జిబిటి జెండాను పట్టుకున్నట్లు పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారింది. తమిళనాడులో పుట్టి ప్రస్తుతం టొరంటో (కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై కాళి టైటిల్‌తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని, లీనా మణిమేకలై వెంటనే క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ కొందరు నెటిజన్లుహెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ క్రమంలో ఆమె వెనక్కి తగ్గకపోగా మరింత రెచ్చగొట్టేలా ఓ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో లీనా మణిమేకలైపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ట్విట్టర్లో #arrestleenamanimekalai అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం అరెస్ట్ లీనా మణిమేకలై హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఓ ట్వీట్ చేశారు. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్ అంటూ డిమాండ్ చేసిన వాళ్లంతా లవ్‌యూ అంటారంటూ ట్వీట్‌లో లీనా మణిమేకలై పేర్కొంది. అయినా ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారటం లేదు.
More Stories
ఎవరెస్ట్‌పై మంచు తుఫానులో చిక్కుపోయిన వెయ్యి మంది
దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కటక్‌లో కర్ఫ్యూ
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం