మధ్యప్రదేశ్ బాలాఘాట్​ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ చనిపోయి ఉంటారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్​ చేశారు.

“చనిపోయిన నక్సల్స్ ను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌గా గుర్తించారు. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. ఏరియా కమాండర్లు మనోజ్, ఒక మహిళ రమే, ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డును ఉంది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఇక.. ఎన్​కౌంటర్​ స్థలంలో నక్సల్స్‌ నుంచి ఏకే-47, 303 రైఫిల్‌, 12-బోర్‌ యాక్షన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చౌహాన్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు. పోలీసు అధికారుల పరాక్రమాన్ని చౌహాన్​ మెచ్చుకున్నారు. వారికి ప్రమోషన్, గ్యాలంటరీ అవార్డులు అందిస్తామని చెప్పారు.

“నక్సలైట్లను చంపిన పోలీసులకు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్, గ్యాలంట్రీ అవార్డు ఇవ్వబడుతుంది. వారి చిత్తశుద్ధిని, ధైర్యాన్ని అభినందిస్తున్నాను. మీలాంటి హీరోలను చూసి మధ్యప్రదేశ్ గర్విస్తోంది’ అని మరో ట్వీట్‌లో సీఎం చౌహాన్​ పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ.. “ఈ చర్య ఏఎస్పీ బాలాఘాట్ నేతృత్వంలో జరిగింది. ఈ సమయంలో హాక్ ఫోర్స్, మధ్యప్రదేశ్ పోలీసు సిబ్బంది కూడా అతనితో ఉన్నారు. ఎస్పీ బాలాఘాట్, ఐజీ బాలాఘాట్ రేంజ్, సిఓ హాక్ ఫోర్స్ మొత్తం ఈ యాక్షన్​కి మార్గనిర్దేశం చేశారు” అని తెలిపారు.

కాగా, మధ్యప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరినీ అనుమతించబోమని, అది నక్సలైట్లు లేదా ఇతర నేరగాళ్లను ఎవరైనా సరే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా  హెచ్చరించారు.