
రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రిని నియమించే బిలును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో 182 మంది అనుకూలంగా, 40 మంది వ్యతిరేకంగా ఓట్లు పడడంతో ‘పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయ చట్టాలు (సవరణ)బిల్లు 2022’ను ఆమోదించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ (జగ్‌దీప్ ధనకర్} స్థానంలో ముఖ్యమంత్రి (మమతా బెనర్జీ) కానున్నారు. కాగా ఈ బిల్లు ద్వారా ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా నియమిస్తే ‘రాజకీయ జోక్యం’ కాగలదని బిజెపి వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిని నియంత్రించాలనుకుంటోంది అని బిజెపి ఎంఎల్‌ఏ అగ్నిమిత్ర పౌల్ ధ్వజమెత్తారు.
కాగా, ఈ బిల్లు ఆమోదంను ప్రస్తావిస్తూ ”దీదీ (మమతాబెనర్జీ) రిటైర్ కావాలే కానీ, చాన్స్‌లర్ కాలేరు. ఇది నా మాటగా రాసి పెట్టుకోండి” అంటూ ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఎద్దేవా చేశారు. ”సొంత రాజకీయాల కోసం ఈ పని చేశారు. ముఖ్యమంత్రిని చాన్స్‌లర్ చేయాలనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
“గవర్నర్ ఆమోదానికి బిల్లు పంపుతారు. దానిని ఆయన ఢిల్లీకి పంపుతారు. అది అక్కడే మాతో ఉండిపోతుంది. దీదీ రిటైర్ కావాలేమో కానీ, ఎప్పటికీ ఆమె చాన్స్‌లర్ కాలేరు. నా పేరు, నేను చెప్పిన మాట రాసి ఉంచుకోండి” అని సువేందు సవాలు చేశారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు